Tuesday, 19 March 2013

మన సమస్యలు తీరాలంటే…



మన -మానవ జీవితానికి సంబంధించిన సమస్యలు అనేకం. కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక సమస్యలతోపాటు విద్యా బుద్ధులు, సంఘం, సంస్కృతి, యుద్ధం, సంధి సమస్యలు; ధన, మాన. పాణ్ర రక్షణకు సంబంధించిన సమస్యలు…ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. మనిషికి ఎదురయి ఉన్న ఈ సమస్యల పరిధి ఒక్కోసారి వ్యక్తికి పరిమిత మయితే, ఒక్కోసారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి విస్తరించి ఉంటాయి. సమస్యలు అవి ఏ రంగంతో ముడి పడి ఉన్నా వాటిని మూడు శీర్షికల్లో విభజించవచ్చు.  1) సిద్ధాంతాలు. 2) సామాజిక సంబంధాలు. 3) చట్టం. మనం, మన నిజదైవాన్ని గహ్రించి, ఆయన ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటే ఈ మూడు శీర్షికల్లో విభజితమయి ఉన్న మానవ సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న పశ్న్రకు సమాధానమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం!
మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు అంతిమ దైవ ప్రవక్త ప్రభవించిన నాటికి లోకంలో అక్కడక్కడా సత్య కాంతి మిణుకుమిణుకుమని కానవచ్చినా అధికాంశం అంధకారమయం.  జ్ఞానానికి మూలమయిన అక్షరం అప్పుడప్పుడు తళుక్కుమనే నక్షత్రం! మత భావాలు మూఢ నమ్మకాల దొంతరలు, సామాజిక అవగాహ నకు సూత్రం; ”గళం గలవాడిదే బలం, బలం గలవాడిదే సుఖం, సుఖం గలవాడిదే అధి కారం” అన్నది. సమాజం తరగతుల్లో విభా జితం: పాలకులు, స్వాములు, నాయకులు. కర్షకులు, దాసులు, బానిసలు, నౌకరులు అధ మాతి అధములు! కులం, వంశం, వర్గం, వర్ణం, తెగ, పగ, కక్ష, వివక్ష సమాజంలో ప్రధాన పాత్రాధారులు; గుణం, సంస్కారం, సభ్యత, నాగరికత, నీతి, నిజాయితీలకు అక్కడక్కడా కడపటి స్థానం. ఆ చీకటి ఎడారి లో విరిసింది వెలుగొందే ఒక రోజా. దాని ఘుమఘుమలే నేటికీ జన వనంలో ఆశల తెరలను నింపుతున్నాయి. ఆ పుష్పరాజం  నోట వెలవడిన సూత్రం: ”ఖూలూ లాఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్‌లిహూ” – మీరు అల్లాహ్  తప్ప ఆరాధ్యులు ఎవరు లేరు అన్న పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధితో స్వీకరించండి, ఇహపర సాఫ ల్యాలు మీ చిరునామ తెలుసుకొని మరీ వచ్చి మీ ముంగిట వాలుతాయి. మీ సకల సమస్య లు తీరతాయి. ఏ సద్వచన కారణంగా సకల సమస్యలు తీరతాయని ప్రవక్త (స) జమానతు ఇచ్చారో ఆ సద్వచనం గురించి సర్వేశ్వరు డయిన  అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్  తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో”.
ఏమిటి, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అని నోటితో ఉచ్చరించడం వల్ల, మనసుతో అంగీకరించ డం వల్ల, అది విధించే పరిధులకు లోబడి జీవించడం వల్ల మానవ – మన సమస్యలు పరిష్కారం అవుతాయా? అన్న తదితర విష యాలను తెలుసుకుందాం!
1) సిద్ధాంతాలు: మనిషి పుట్టగానే ఒక ప్రత్యేక వాతావరణాన్ని గమనిస్తాడు. ఇక్కడ సూర్య   చంద్రాదుల ఉదయం, అస్తమయం జరుతున్న ది. పగలు వస్తుంది, రేయి పోతుంది. నింగిలో ని తారకలు తళుక్కునమెరుస్తాయి, పుసుక్కున మాయమైపోతాయి. నేల సస్యశ్యామలంగా కళకళలాడుతుంది.  ఎండి వెలవెలబోతుంది. నీరు యేరయి గలగల పారుతుంది, ఎండి పోతుంది కూడా. సృష్టిలో నిరంతరం జరిగే ఈ మార్పులు ఇట్టే దాటి పోవు.మనిషి దేహం పైనే కాకుండా ఆత్మపైనా, ఆలోచనపైన సయి తం ప్రభావం చూపుతాయి. ఉదయం ఉపాధి ఆధారమయితే, రాత్రి విశ్రాంతికి మూలం. మనిషి చుట్టూ జరిగే ఈ మార్పులు అతనికి సంతోషాన్ని, సుఖాన్నీ ఇస్తాయి. దుఃఖానికి, కష్టానికీ గురి చేస్తాయి. వీటి ద్వారా మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు, అనారోగ్యం పాలూ అవుతాడు. ఒక్కోసారి అతనికనిపిస్తుంది – తన ఆదేశం, అధికారం, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు – చివరికి తన దేహం మీద సయితం లేదు అని. ఈ భావన కలగగానే ప్రపంచంలో తనకి లాభనష్టాన్ని కలుగజేసే  ప్రతి వస్తువు అతన్ని భయపెట్ట సాగింది. ఫలితంగా మనిషి అవనిని పూజించడం ప్రారంభిం చాడు, అందులో ఎనలేని నిధులూ నిక్షేపాలు ఉన్నాయని. ఆకాశాన్ని దేవతగా భావించాడు, అది వరాల జల్లు కురిపిస్తుందని. పర్వతాల ముందు తల వంచాడు, అవి తనకన్నా ఎంతో ఎత్తయిన వనీ. సముద్రాలంటే ఆపాద మస్తకం వణకిపోయాడు, దాని పొగరుమోతు (సునామీ లాంటి) కెరటాలు తనను నాశనం చెస్తాయోమోననీ. ఇలా అండం మొదలు బ్రంహ్మాండం వరకు – అన్నింటి ని పూజించడం, గులామ్‌గిరీ చేయనారంభించాడు. దేవుడున్నాడని నమ్ముతూనే పుణ్య పురుషుల ను, సంఘసంస్కర్తలను దైవానికి సాటి చేసి కొలవనారంభించాడు. మనిషిగా పుట్టించి సృష్టిరాసు ల్లోనే శ్రేష్ఠ స్థానాన్ని దేవుడు తనకిస్తే, తన అసమర్థతతో అధఃపాతాళానికి దిగజారాడు మనిషి. ఈ యదార్థాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా అభివర్ణిస్తుంది:
”నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమయిన ఆకృతిలో సృజించాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాలకు బదులుగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5)
అతనిలో చోటు చేసుకున్న భయాలన్నీ అతను మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే ఒక్క సత్యంతో పటాపంచలు కాగలవు. కానీ, అతను ఆ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే, ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నది ఒకే ఒక్క సృష్టికర్త అని, విశ్వం మొత్తం ఆ నిజ స్వామికే తలొగ్గి మనుగడ కొనసాగిస్తుందని తెలుసుకునేవాడు. ఆ ఒక్క నిజ అధికారికి మాత్రమే భయ పడేవాడు. ఆ సత్య ప్రభువు పట్ల వాస్తవమయిన భక్తి అతన్ని సకల భయాల నుండి ముక్తి కలిగిం చేది. ఆ కృపాసాగరుని దాస్యం సకల దాస్య శృంఖలాలను త్రెంచేసేది. జ్ఞానోదయం కలిగిన అతను గొంతెత్తి ఇలా చాటేవాడు: నేను నింగిలో మెరిసే తారకల్ని చూశాను. అవి కొంత కాలం ఉంటాయి తర్వాత నిష్క్రమిస్తాయి. నేను పండు వెన్నెల్ని పంచే ప్రకాశమనయిన చంద్రుణ్ణి చూశాను. అదీ కనుమరుగవుతుంది. నేను బ్రహ్మాండంగా వెలిగిపోతున్న సూర్యున్ని చూశాను, అదీ ఓ సమయం తర్వాత అస్తమిస్తుంది. ఇలా ఒక సమయం నుండి మరో సమయం వరకూ వచ్చీపో యేవేవి దైవం కాలేవు, వాటిని నియామనుగుణంగా నడిపిస్తున్న ఆ సర్వశక్తిమంతుడే  నా ఉపా సనారీతులన్నింటికీ అర్హుడు.
”నిశ్చయంగా నేను భూమి, ఆకాశాలను పుట్టించివాని వైపునకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పు కుంటున్నాను. నేను బహుదైవరాధకుల్లోని వాడను కాను”. (అన్‌ఆమ్‌: 79)
అంటే, మనిషిలోని మతపరమయిన, విశ్వాసపరమయిన భ్రమ, భ్రాంతులన్నింటినీ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అల్లాహ్  తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు – అన్న సద్వచనం తొలగించి, అత నికి క్రాంత దృష్టిని, శాంత స్వభావాన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మతపరమయిన సకల రుగ్మతలకు, దురాచారాలకు, నూతన పోకడలకు విరుగుడు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’!
ఇదో మానవ జీవితానికి సంబంధించిన కోణమయితే, మరో కోణంలో మనిషి సృష్టిలో జరిగే ఈ మార్పుల గురించి తెలుసుకున్నాడు. ఏదో అదృశ్య శక్తి ఆదేశం మేరకు నిప్పు మండుతుందని, నీరు ప్రవహిస్తుందనీ, నేల ధాన్యం పండిస్తుందనీ,, సుభిక్షమయినా, దుర్భిక్షమయినా, కలిమి అయినా, లేమి అయినా, జననం అయినా, మరణం అయినా ప్రతిదీ ఆ అదృశ్య శక్తి ఆజ్ఞకే కట్టు బడి ఉన్నాయని గ్రహించాడు. మనిషిలో పరిశోధించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది,  అతని అన్వేషణ మొదలయింది.  ఆ శక్తి ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పరితపించాడు. ఆ శక్తిని తాను చూడలేడుగాని  ఆ విశ్వకర్త శక్తి సంబంధించిన నిదర్శనాలు అడుగడుగునా దర్శ నమిస్తున్నాయి.  మనిషి తనకున్న పరిమిత జ్ఞానంతోనే తర్కించడం మొదలెట్టాడు – నా కళ్లకు కనబడని, నా వీనులకు వినబడని, నా పంచేంద్రియాల పరిధిలోకి రాని ఒక వస్తువును నేనెందు కు నమ్మాలి. పురోగమానికి బదులు తిరోగమం చోటు చేసుకుంది. ఈ విశ్వంలో ఎవరి పరిపా లన సాగుతుందో తెలియనప్పుడు ఆ శక్తిని అంగీకరించి ప్రయోజనం ఏమిటి? అతను గ్రహిం చాడు; విశ్వంలో కొన్ని సాధనాలు కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి. నిప్పు కాల్చుతుంది. నీరు వల్ల మొక్కల్లో ప్రాణం వస్తుంది. విషం మనిషిని చంపుతుంది. అమృతం మనిషిని బ్రతికిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అతనో నిర్ణయానికి వచ్చాడు. తాను ఒక ప్రత్యేక వాతావరణంలో జీవిస్తున్నాడు. ఇక్కడ అతనికి ప్రతికూలంగా, అనుకూలంగా కొన్ని శక్తులు బలంగా పని చేస్తున్నాయి. అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ అనుకూల శక్తుల వల్ల ప్రయోజనం పొందడం ఎలా? ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవడం ఎలా? అన్నదే అతని ఆలోచన, అన్వేషణకు అంతిమ గమ్యంగా నిలిచింది. తాను జరిపిన పరిశోధనా మత్తులో అతను ఆ విశ్వకర్తనే నిందించాడు. ఆయనకే పోలికలు కల్పించే దుస్సాహసం చేశాడు. ఇదే విషయాన్ని సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ా ఇలా తెలియజేస్తున్నాడు: ”వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కానీ (మరోవైపు) తన పుట్టుకనే మరచి పోయాడు. ‘కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు (రా) బ్రతికిస్తాడు?’ అని (మాకే) సవాలు విసురుతున్నాడు. (ఇలా) చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (మలిసారి) కూడా బ్రతికిస్తాడు”. (యాసీన్‌: 78,79)   తన పుట్టుక ఎందు నిమిత్తం జరిగింది? తనెందుకు ఈ లోకంలో ఉన్నాడు? జీవిత గడువు ముగిశాక చచ్చి తాను ఎక్కడి వెళ తాడు? తాను చేసుకున్న పాపపుణ్యాల పర్య వసానం ఏమిటి? నిరాఘాటంగా, నిర్విఘ్నం గా, నిరంతరాయంగా ఓ కట్టుదిట్టమయిన నియమానికి లోబడి నడుస్తున్న ఈ విశ్వ వ్యవస్థ చివరికి ఏమవుతుంది? వీటి గురించి అతను అస్సలు ఆలోచించ లేదు. ఫలితం – నిజ దైవ జ్ఞానం లేని భక్తి మానవ సమాజం పాలిట ప్రమాదంగా మారినట్టే, వాస్తవదైవం పట్ల భక్తి లేని విజ్ఞానం వినాశకాలకు కారణ భూతమయింది.  అదే అతను ఈ సృష్టికి కర్త ఉన్నాడు, అతను ఒక్కడే అన్న యదార్థా న్ని అంగీకరించి ఉంటే నేడు అతను వైజ్ఞాని కంగా గొప్ప విజయాల్ని సాధించి కూడా పరిష్కరించుకోలేకపోతున్న అనేకానేక సమ స్యలు ఇట్టే సులభంగా పరిష్కారం అయ్యేవి.  అంటే దైవాన్ని విశ్వసించడంతోపాటు అనేక శక్తుల్లో విశ్వాసం గలవారు, విగ్రహారాధ కులు సృష్టి పూజారులు ‘లా ఇలాహ’అంటూ సృష్టికర్త వ్యవహారంలో సృష్టిరాసుల జోక్యాన్ని నిరాకరించాలి. ఈ సృష్టికి కర్త అనేవాడే లేడు, ఉన్నా ఆతన్ని నమ్మడం వల్ల ప్రయోజ నం లేదు అని అనుకునేవారు ‘ఇల్లల్లాహ్ ’ ఒక్క అల్లాహ్  మాత్రమే ఈ సృష్టి మొత్తాన్ని నియమబద్ధంగా నడుపుతున్నాడన్న యదార్థా న్ని అంగీకరించాలి. ‘లా ఇలాహ’ అన్న అనంగీకారం, ‘ఇల్లల్లాహ్ ’ అన్న అంగీకారం తో మానవాళి సైద్ధాంతిక పరమయిన, మత పరమయిన దొంతరలు, ద్వంద ప్రమా ణాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే నేప థ్యంలో దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) మాన వాళిని ‘ఖూలూ లా ఇలాహ ఇల్లల్లాహ్  తుఫ్లిహూ’ అని ఘంటాపథంగా పిలుపుని చ్చారు.
లా ఇలాహ ఇల్లల్లాహ్  అని
పలుకరండి ఓ ప్రజలారా!
(మానవులందరిని దేవుడు ఒకే జాతిగా అభి వర్ణించినప్పుడు మనుషుల మధ్య ఈ భేదభా వాలు, వర్గాలు, వర్ణాలు, కులాలు, అంట రానితనాలు, అస్పృశ్యతలు ఎందుకున్నట్టు? ఈ సామాజిక అసమానతకు అసలు కారణం ఏమిటి? ఇవి ఇటువంటి ఇతర అనేక ప్రశ్న లకు జవాబు కావాలంటే  కాస్త  వేయిట్‌ చేయాల్సిందే!)
మన సమస్యలు తీరాలంటే…. 2
  ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గల వాడే అల్లాహ్  సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్  అన్నీ తెలిసినవాడు, అప్ర మత్తుడు. (దివ్యఖురాన్ – 49: 13)
ఈ వచనంలో దేవుడు మానవులంతా ఒక్కటే అనే సమగ్ర భావనను బోధిస్తున్నాడు.అయినా, వారిని పరస్పర ఘర్షణకు, పోరుకు పురికొలిపే విషయ మేమిటి? సమాధానమొక్కటే, దేవుడు మనిషికి బోధించిన విశాల దృక్పథాన్ని వదలి తన చుట్టు చిన్న చిన్న గీతలు గీసుకుని ఆ గీతల పరిధిలో ఉన్న వాళ్ళనే తన వాళ్ళుగా భావించసాగాడు.  ఈ భావన ఒక్కోసారి వంశం వరకు, ఒక్కోమారు భాష వరకు, ఒక్కోసారి జాతి వరకు వెళ్ళేది. అంతకు మించిన విశాలత దానికి లేదు. ఆ విధంగా పరిమిత స్థాయిలో – వంశం, భాష, జాతి మనుషులను సమైక్య పరచినప్పటికీ మాన వుని అవసరాలు, ప్రయోజనాలు బహు దూరాల వరకు వ్యాపించి ఉన్నాయి.  ప్రపంచమే ఒక గదిగా మారిపోయిన నేటి తరుణంలో ఈ ఎల్లలు ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. మా జాతే గొప్ప జాతి అని ఒక జాతీయ నాయకుడు, అంత ర్జాతీయ స్థాయికి చెందిన వ్యక్తి చెబుతున్నాడంటే, ఇతరుల్ని అతను ఏ దృష్టితో చూస్తున్నాడో ఇట్టే అర్థమయిపోతుంది.
ఈ భావన కారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి జాతి భక్తిప్రపత్తుల, ప్రేమాభిమానాల పరిధి, మూర్తి వేర్వేరుగా ఉంటుంది. వారు తమ పరిధిని సమర్థించుకోవటానికి ఇతరుల్ని నిందిస్తారు, ఖండిస్తారు, కించ పరుస్తారు, అవసమైతే నిర్బం ధిస్తారు, బహిహ్కరిస్తారు, మరీ అవసరమను కుంటే తుదముట్టించేందుకు సయితం వెను కాడరు. ఆసియాకు చెందిన వాడు యూరప్‌ పట్ల వైషమ్యం ఏర్పరచుకుంటాడు. ఓ దేశంలో మరో దేశానికి స్థానం లేదు. ఒక ప్రాంతానికి మరో  ప్రాంతం అంటే గిట్టదు.
 వర్గం, వర్ణం, జాతి, ప్రాంతం, రంగు మొౖదల యిన ఈ వ్యత్యాసాలన్నింటికి పరిష్కారంగా విశ్వ మానవ సోదర భావం ముందుకొస్తుంది. అంటే జాతులన్నీ తమ సమిష్టి ప్రయోజనాల కొరకు పాక్షికాలను ప్రక్కన పెట్టి సమైక్యమయి పోవాలి. వాటి సాధనకు కృషి చేయాలి. తాము ప్రశాంతం గా జీవించాలి. ఇతరుల్ని ప్రశాంతంగా జీవించ నివ్వాలి. అయితే మనిషి ఏర్పరచుకున్న క్రియా జీవితం దీన్ని సమర్థించదు. మనిషి ప్రయోజనా లు అతని సిద్ధాంతాలకు లోబడి ఉంటాయి. మనిషి, యుద్ధం, సంధి, స్నేహం, శత్రుత్వం అన్నీ వ్యవహారాలు సిద్ధాంతాల ఆధారంగానే నెరుపు తాడు. సిద్ధాంతాల్లో వైవిధ్యం ఉంటే ప్రయోజ నాల్లో సమైక్యత సాధ్యం కాదు.  కమ్యూనిజాన్ని నమ్మేవాడు పెట్టుబడి దారీతో సంధి ఒడంబడిక చేయడు. జాతి తత్వంలో నమ్మకమున్నవాడు విరోధ జాతి ప్రగతిని సహించడు. సుదీర్ఘ మానవ చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఈ భిన్నత్వం వల్ల మానవుల్లో సదా వివాదాలు, పోరాటాలే సాగాయి. అలాంటప్పుడు అదే వారి మధ్య ప్రేమానురాగాలకు మార్గం కావడం అసంభవం.
ఇక ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ అన్న భావన పై వచ నంలా మానవులంతా ఒక్కటే అని నిర్ణయిస్తుంది. అది మానవులందరికీ ఒకే ఆశయాన్నీ నిర్ధారిస్తుం ది.  మానవులందరి కర్త, స్వామి, ఆరాధ్యుడు, పూజ్యనీయుడు ఒక్కడే అంటుంది. ఆయన భార తీయునికి వేరుగా, చైనీయునికి వేరుగా, రష్యన్‌కు వేరుగా, ఆమెరికన్లకు వేరుగా లక్ష్యాలు నిర్ణయించ లేదు అంటుంది. మానవుని సృష్టికర్త, భువిపై  నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గాన్ని తన దాస్యం చేయమని కోరాడు. ఈ నిమిత్తమే ఆయన ప్రవ క్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజే శాడు. వారందరూ ప్రతిపాదించిన విషయం, మనమంతా ఒక్కటే అన్నది ఒకటయితే, ‘మనం దరి దైవం ఒక్కడే’ అన్నది మరోకటి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనల లోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి”.
 (అర్రూమ్‌: 22)
”ఒక అరబ్బుకి అరబ్బేతరునిపైగానీ, ఒక నల్ల వాడికి తెల్లవాడిపైగానీ ఎటువంటి ఆధిక్యతా లేదు; దైవభీతితో తప్ప. మీరందరూ ఆదం సంతానమే. ఆదమ్‌ను దేవుడు మట్టితో పుట్టిం చాడు” అని దైవప్రవక్త (స) అంతిమ హజ్జ్‌ సందర్భంగా ప్రకటించారు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’కు ఇంతటి మహత్తర శక్తి ఉందా? అంటే దానికి ప్రబల నిదర్శనం నమాజే.
ఇకపోతే, ఈ సద్వచన భావమేమంటే, ‘అల్లాహ్  తప్ప వేరే ఏ ఇతర ఆరాధ్య దైవం లేదు’.కలిమా లో ఏముంది? కొన్ని అక్షరాలు మాత్రమే కదా! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ’ ఈ అక్షరాలను కలిపి ఉచ్చరిస్తే ఎమయినా మాయ జరుగుతుందా? మనిషి స్థితిగతులే మారిపోవడానికి? తాము చదివే మంత్రానికి భావమేమిటో తెలియకపో యినా, మంత్రం పఠించగానే కొండలు కంపిస్తా యనీ, భూమి బ్రద్ధలవుతుందనీ, సముద్రాలు ఉప్పొంగుతాయని కొందరయితే భావించగలరు. ఎందుకంటే, పవర్‌ అంతా అక్షరాల్లోనే ఉందని, అవి నోటి నుండి వెలువడగానే మాయా ద్వారా లు తెరుచుకుంటాయని వారి విశ్వాసం. కాని ఇక్కడ అలా కాదు. ఇక్కడ అర్థానికి, అంతరాత్మ కు, ఆచరణకే ప్రాధాన్యత. చలి వేసిన వ్యక్తి ‘కంబళి, కంబళి’ ‘దూది పరుపు, దూది పరుపు’ అంటూ కూర్చుంటే ఎలాగయితే చలి బాధ తగ్గదో, సద్వచన విషయంలోనూ అంతే. మనిషి భావాలపై, ఆచరణలపై, తీర్పులపై ఈ సద్వచన ఆధిపత్యం చోటు చేసుకున్నప్పుడే లోక కళ్యాణం సాధ్యం. ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్నిన వ్యక్తి నోట సదా ఈ మాట ఉంటుంది:
”ఆయనే నన్ను సృష్టించినవాడు. మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు మరియు  త్రాపిస్తున్నాడు. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. ఆయనే నన్ను చంపుతాడు. మళ్ళి తిరిగి బ్రతికిస్తాడు. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకు ఉంది”. (అష్‌ షుఅరా: 78-82)
ఈ భావన మానవుల మధ్య కుల, వర్ణ, వర్గ, భాష, జాతి దురభిమానాలను అంతమొంది స్తుంది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ను త్రికరణ శుద్ధి తో విశ్వసించిన తర్వాత మనిషిలో బూటకపు కీర్తిప్రతిష్టల భేదభావాలు తలెత్తవు. ఒకే దేవుని దాసులం అన్న అత్యుత్తమ భావన, యజమాని- కార్మికులను, పాలితుల-పాలకులను, రాజు-పేద ను ఒకే వరుసలో నిష్ఠగా నిలబడేలా తీర్చిదిద్దు తుంది. మానవులందరినీ సోదరులుగా ఎంచే ఏ సిద్ధాంతమూ ఇస్లాంను మినహా లేదు. అందు వల్లనే ఇస్లాం వైపునకు దృష్టి మరలినప్పుడు మరో వైపు చూసే అవసరం ఏర్పడు. (సశేషం)

ఔదార్యాన్ని, త్యాగ నిరతిని నేర్పే శిక్షణా కాలం


ఆయిజ్ అబ్దుల్లాహ్ అల్ ఖర్నీ

ప రమ పభ్రువైన అల్లాహ్‌ ఈ విధంగా సెల విచ్చాడు: ”మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్య కార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్‌ దగ్గర అత్యుత్తమ రూపంలో అత్యధికంగా పొందుతారు”  (ఖుర్‌ఆన్ 73:20)
  ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: ”అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్‌ా తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్‌ా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు”. (ఖుర్‌ఆన్‌- 2: 261)
    ఒక ప్రామాణికమైన హదీసులో ఇబ్నె అబ్బాస్‌ (ర ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స ) సహజంగానే ప్రజలందరిలోకెల్లా ఎక్కువ దానశీలురు. అయితే రమజాన్‌ నెలలో జిబ్రయీల్‌ దూతను కలిసినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఔదార్యం కనబర్చేవారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఆయన ఔదార్యం ప్రభంజనం కంటే వేగంగా ఉంటుంది. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమని, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోమని, నిరుపేదలకు చేయూతనివ్వమని ఉపవాసం ప్రోత్సహిస్తుంది. రమజాన్‌ మాసం దైవమార్గంలో ఖర్చు చెసే వారి కాలం. త్యాగం చేయాలని, పరులకు ఎంతోకొంత ఇవ్వాలని ఉవ్విళ్ళూరే సదాచార సంపన్నులకు రమజాన్‌ మాసం ఓ సువర్ణావకాశం. అల్ల్లాహ్‌ మీకేదైనా ప్రసాదించి ఉంటే అందులో కొద్దిగా నిరుపేదల కోసం త్యాగం చేయండి. ధనం నీరు లాంటిది. నీరు ప్రవహిస్తూ ఉంటే తియ్యగా, తాజాగా ఉంటుంది, దాని ప్రవాహాన్ని అడ్డుకున్నట్లయితే అది మురిగి, కలుషితమయి విషంగా మారిపోతుంది.
    త్యాగం ఎంత గొప్పది! దానం ఎంత మహోన్నతమైనది! ఔదార్యం ఎంత సుందరమైనది! ”ప్రతి రోజూ ఇద్దరు దైవ దూతలు దివి నుండి దిగి వస్తారు. వారిలో ఒక దూత, ‘అల్ల్లాహ్! ఖర్చు పెట్టేవాడికి ప్రతిఫలాన్ని ప్రసాదించు’ అని ప్రార్థిస్తే, రెండో దూత, ‘అల్ల్లాహ్‌ కూడబెట్టుకునే వాడి సంపదను నాశనం చెయ్యి’ అని ప్రార్థిస్తూ ఉంటాడ”ని దైవప్రవక్త (స ) ప్రబోధిం చారు.   ఆ విధంగా అల్లాహ్‌ దాసులు ఎవరైనా ఆయన మార్గంలో ఎంతో కొంత ధనం ఖర్చు చేసినప్పుడు దాని మూలంగా అల్లాహ్‌ా వారి భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక స్థితిగతుల్లో సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. అతని జీవనావసరాలకు సరిపోయే వస్తువుల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు. ”నీరు మంటను ఆర్పేసినట్లే, దానధర్మాలు రాబోయే ఆపదలను తప్పిస్తాయి” అని దైవప్రవక్త (స ) ప్రవచించి ఉన్నారు. చెడు పనులు మనసుల్లో మంటను రాజేస్తాయి. ఆత్మల్లో వేడిని రగిలిస్తాయి. జీవితాన్ని నిప్పుల కుంపటిగా మార్చేస్తాయి. ఒక్క దానధర్మాలు మాత్రమే ఆ అగ్ని జ్వాలల్ని చల్లార్చగలవు. దానం మనో వేడిని చల్లబరుస్తుంది. ఆత్మలో పరిమళాన్ని గుభాళింపజేస్తుంది. ప్రతి చెడు కార్యాన్ని పరిపూర్ణమైన రీతిలో తొలగిస్తుంది.
  ”మనిషి ప్రాపంచిక జీవితంలో చేసి వెళ్లిన దానధర్మాలు పరలోకంలో అతనికి నీడ కల్పిస్తాయి. ఆ రోజు మానవులకు సంబంధించిన పరస్పర సమస్యలన్నీ తెమలేదాక అతను ఆ నీడ పట్టునే ఉంటాడు” అని ప్రవక్త (స ) ప్రబోధించారు. దాన ధర్మాలు విశాలమైన నీడను కలిగి ఉండటం, ఆ నీడలో మనుషులు ప్రతిఫల దినాన సేద తీరటం, ఆ నీడ ఇహలోకంలో ఆచరించిన దానధర్మాలకు తగ్గట్టు అద్భుతంగా ఉండటం, వింటుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ?!
  రుజువర్తనులైన మన మూడవ ఖలీఫా ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌ (ర ) గొప్ప ధనవంతులు. ఆ  కాలంలో   ముస్లింలు  ’తబూక్‌’
అనే ప్రాంతంలో ఓ మహా సంగ్రామం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ముస్లింలకు యుద్ధ సామగ్రి, ఇతర ఆయుధ పరికరాలు అవసరమయ్యాయి. కేవలం అల్లాహ్‌ా ప్రసన్నత కోసం తన సంపదను, ఆస్తులన్నింటినీ ఖర్చుపెట్టి ముస్లిం సేవకులకు కావలసిన యుద్ధ సరంజామా అంతా ఆయన సమకూర్చారు. ప్రత్యేకంగా ముస్లింల కోసం ఆ కాలంలో మొత్తం ఒక బావినే కొనేశారాయన. అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ మరో గొప్ప ధనవంతులైన సహాబీ (దైవ ప్రవక్త సహచరులు). అల్ల్లాహ్‌ ప్రసన్నత కోసం ఆయన ఒకసారి, 700 ఒంటెలపై మోపబడి ఉన్న తన వ్యాపార సామగ్రి మొత్తం మదీనా నగరంలోని పేద ప్రజలకు పంచి పెట్టారు.  ఒక చిన్న రొట్టె ముక్కకూ, చుక్క పాలకూ, పట్టెడన్నానికీ నోచుకోకుండా పస్తులు గడుపుతూ ఉపవాసాలు పాటిస్తున్న అభాగ్య జీవులెందరో మన సమాజంలో బతుకు బండి లాగుతున్నారు.
 తల దాచుకోవటానికి ఇల్లులేక, ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళటానికి కనీస వాహన వసతుల్లేక, కష్ట కాలంలో తమను ఆదుకునే స్నేహితులూ లేక సతమతమవుతున్న ఎంతో మంది దీనులూ మన చుట్ట్టు ప్రక్కల్లో ఉపవాసం పాటిస్తున్నారు.
 తినేందుకు ఏమీ లేక పస్తులతోనే ఉపవాసం ప్రారంభించి, తిరిగి ఉపవాస విరమణ (ఇఫ్తార్‌) సమయంలోనూ గుక్కెడు మంచి నీళ్ళతో సరిపెట్టుకుని పస్తుల్ని కొనసాగించే కష్టజీవులకూ మన సమాజంలో కొదువ లేదు.
బహుశా ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకుని దైవప్రవక్త (స ), ”ఎవరయినా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమింపజేస్తే (అంటే ఇఫ్తార్‌ చేయిస్తే) ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం అతనికీ లభిస్తుంది. అలా అని ఆ ఉపవాసి పుణ్యంలోనూ ఎలాంటి కోతా విధించబడదు” అని వక్కాణించారు.  ఈ కారణంగానే సదాచార సంపన్నుల ఔదార్యం శుభప్రదమైన రమజాన్‌ మాసంలో అనూహ్యంగా పెరిగిపోతుంది. ఈ మాసంలో వారు దైవ మార్గంలో అమితంగా ధనం ఖర్చు పెడతారు. ఎముక లేని చేత్తో దానధర్మాలు చేస్తారు. అసాధారణ త్యాగ భావాన్ని కనబరుస్తారు. వారిలో చాలా మంది నిరుపేదలకు అన్నదానం చేస్తారు. రమజాన్‌ నెలలో ప్రతి రోజూ ఉపవాసకులకు ”ఇఫ్తార్‌” (ఉపవాస విరమణ) చేయిస్తారు, అలా చేసి వారు విశ్వ ప్రభువైన అల్లాహ్‌ా నుంచి గొప్ప పుణ్యాన్ని, మహోన్నతమైన ప్రతిఫలాన్ని అందుకుంటారు.
  సదాచార సంపన్నులైన మన పూర్వీకుల కాలంలో మస్జిదులు ఎల్లప్పుడూ పేదల కొరకు సమకూర్చబడిన ఆహార  పదార్థాలతో  నిండుగా ఉండేవి. మస్జిదులలో భోజన సదుపాయాలు కలిగించి అన్నార్తులు, అవసరార్ధులు ఒక్కరు కూడా  లేకుండేటట్లు  లేకుండేటట్లు చేసేవారు మన పూర్వీకులు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అల్లాహ్‌ దాసులు తమ తోటి నిరు పేదలకు అన్నపానీయాలతో సత్కరించినా, వస్త్రదానంతో గౌరవించినా అందులో తమకు అల్లాహ్‌ా ప్రసన్నతా ఉద్దేశం లేకపోతే దానివల్ల ఎలాంటి పుణ్యమూ రాదు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు:
   ”మీరు గనక అల్లాహ్‌కు మంచి రుణం ఇస్తే (అంటే అల్లాహ్‌ మార్గంలో ఖర్చు పెడితే) దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూ పోతాడు. మీ పాపాలను కూడా  క్షమిస్తాడు. అల్లాహ్‌ (తన దాసుల సేవలను) గుర్తించేవారు, సహనశీలుడు.” (ఖుర్‌ఆన్ 64:17)
ఓ ఉపవాసీ! ఈ రోజు నువ్వు చేసే త్యాగం, నువ్వు ఇచ్చే దానం రేపు నువ్వు పేదరికంలో, అవసరంలో ఉన్నప్పుడు నీకు పనికి రావటానికి నీ ప్రభువుకు ఇచ్చుకుంటున్న రుణమేనని గ్రహించు. ఆ రేపు మరేదో కాదు, ప్రతిఫల దినమే. మనిషి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండని రోజు. ఓ ఉపవాసీ! దప్పిక గొన్న వానికి ఈ రోజు నువ్వు త్రాపించే గుక్కెడు నీళ్లు, శ్రమ జీవి గుండె చల్లదనం కోసం నువ్వు పోసే కాసిన్ని పాలు ఆకలిగొన్న వానికి నువ్వు పెట్టే పట్టెడన్నం, అవసరంతో సతమతమవుతున్న మనిషికి నువ్వు చేసే కొద్దిపాటి ఆర్థిక సహాయం, బట్టలు లేని బీద ప్రజలకు నువ్విచ్చే వస్త్రదానం – ఇవన్నీ నీ స్వర్గారోహణకు సోపానాలని నువ్వు తెలుసుకోవాలి.
http://www.new-muslims.info/tel/abcs-of-islam/divine-unity/manasamasyalu/
   ఓ ఉపవాసీ! అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. దానం కన్నా ఎక్కువగా మరే వస్తువూ సంపదను పరిశుద్ధ పర్చదు. ఎంతో మంది ధనవంతులు అంతులేని తమ సిరిసంపదలను, నిధులు నిక్షేపాలను, ఎత్తయిన భవనాలను, మేడలను మిద్దెలను ఎలా సంపాదించారో అలాగే ఈ లోకంలో వదిలిపెట్టి చనిపోయారు. కాని తాము జీవించి ఉన్నప్పుడు వారు వాటిని అల్లాహ్‌ మార్గంలో ఉపయోగించకపోవటం మూలంగా వారి తదనంతరం కూడా ఆ సంపద వారి పాలిట దుఃఖానికి, సంతాపానికి కారణమయింది. రేపు ప్రళయ దినాన విజేతలెవరో, ఓటమి పాలయ్యేదెవరో నువ్వే చూస్తావు! సహాయం లభించేది మాత్రం అల్లాహ్‌ తరఫు నుంచే సుమా!