Saturday, 16 July 2011

ఎందుకని ?

మన అధరాలు దేశాభిమాన గేయాలు ఆలపిస్తున్నాయి  కాని మన మనసులో దేశాభిమానం లేదు ఎందుకని? 
మన దేశ పటాన్ని ఇచ్చే గౌరవం మనం దేశ ప్రజలకు ఇవ్వం ఎందుకని ? 
మన దేశ జెండాకు ఇచ్చే ప్రాధాన్యత మనం దేశ ప్రయోజనాలకు ఇవ్వ్వం ఎందుకని? 
స్వతంత్ర దినోస్త్సవ శుభాకాంక్షలు అందుకుంటూనే ఆలోచించండి........!!!
من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం -  
- عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.

అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు - నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.


వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు.  ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃

1.ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి అవ్వలుహు, ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో - మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.  
3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.

من آداب العطاسఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి  -

عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హందులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్,  ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.
అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్  అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్  అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్  అని పలకవలెను.

వివరణ:- హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును 

Wednesday, 13 July 2011

aanandangaa undaalante......


ఒక క్షణం ఆనందం, మరోక్షణంలో దిగులు దీనికి కారణం ఏమిటి? మన మూడ్‌ ఎప్పటికప్పుడు మారుతూ ఉండటమా? ఇలా మారడానికి కారణం ఏమిటి? మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలే మూడ్‌ మారటానికి కారణమని, మన శరీరంలో విడుదలయ్యే అమినోయాసిడ్స్‌ వల్లే మన ఉద్వేగాలు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక స్థాయిలో అవి ఆందోళనను కలిగిస్తాయి. మరో స్థాయిలో భయం, ఇంకో రసాయనం కలిస్తే కోపం. కొన్నిసార్లు ఆశావాదం, అంతలోనే నిరాశావాదం రావడం. ఇలా మూడ్‌ మారిపోవడం సహజమే. ఒకేరకమైన మూడ్‌ తరచూ రావడం, ఒకే రకమైన మూడ్‌లో కొద్దికాలం గడపడం ప్రమాదకరం. ఇలా జరగడం వల్ల మన వర్క్స్‌, మన అనుబంధాలు, స్నేహాలు, మన రూపురేఖలు కూడా మారతాయి. ఇందువల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నెగిటివ్‌ ఆలోచనలు ఎక్కువవ్ఞతాయి. వాటిని అధిగమించడానికి కొన్ని పద్ధతులను పాటించండి ఇలా!

 
మూడ్‌ సరిగా లేనపుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించవద్దు. ఇలా చేస్తే ఇంకా కృంగిపోయే అవకాశముంది. ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో కలిసి పోయి మాట్లాడుతూ ఉంటే వారి సమస్యలు వింటూ ఉంటే, మన సమస్యలు చాలా చిన్నవిగా, సులువ్ఞగా పరిష్కరించుకోగలిగేలా ఉంటాయి.
 మీ మూడ్‌ బాగాలేనపుడు మీ దృష్టిని వేరే విష యాలమీద మరల్చండి. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌, ఫన్నీషో ఏదైనా ఫరవా లేదు. ఇష్టమైనవినడం, పుస్తక పఠనం ఇలాంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
నిరాశగా ఉన్నపుడు ఏకాగ్రత ఉండదు. ఏ పని మీద దృష్టి ఉంచలేరు. అటువంటి సమయాలలో ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీద మనసు లగ్నం చేయండి. శ్వాసమీద దృష్టిని ఉంచి, శ్వాస క్రమబద్ధంగా జరిగేలా చూడండి. ఇలా కొద్దిసేపు చేసినట్లయితే మీ మూడ్‌ మారి ప్రశాంతతను పొందుతారు.
జుట్టు పీక్కోవాలనంత చికాకుగా ఉంటే, జుట్టుకు నూనె రాసుకుని మీకిష్టమైన షాంపూతో స్నానం చేయండి. వీలైతే స్నానపు నీళ్లలో పరిమళాలు వెదజల్లే వాటిని కలపండి. ఇవి మిమ్మల్ని తాజా పరిమళాలతో, సరికొత్త వాతావరణంలోకి తీసుకెళతాయి.
మూడ్‌ బాగాలేనపుడు ఏదో ఒక పనిలో నిమగ్నం కండి. మీ మనసు ఊరట పొందుతుంది. గదిని శుభ్రం చేయటంలోనూ, షెల్ఫును సర్దడం లోనూ వివిధ వస్తువ్ఞలను అమర్చడంలోనూ ఇలా ఏదో ఒక పనిలో బిజీ అయిపోండి. దీని వలన మీ స్తబ్దత తొలగి రిలాక్స్‌ అవ్ఞతారు.
నిశ్చలంగా ఒక దగ్గరే ఉండకుండా నడవండి, కూర్చోండి, పడుకోండి, పరుగెత్తండి. శరీరం మొత్తం కదిలేలా మీకిష్టమైన  ఎక్సర్‌సైజులు చేయండి. ఇవన్నీ మీ మెదడు మీద ప్రభావం చూపించి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
మూడ్‌ బాగాలేనపుడు మీ హాబీని కొనసాగించండి. కుట్టికలో, అల్లికలో, పెయింటింగ్‌లు వేయడం, చిత్రాలు గీయడం, రచనావ్యాసంగం, ఇష్టమైన పాటలు వినడం, మీకిష్టమైన ఫొటో ఆల్బమ్‌లను మరలా చూడటం, మీరు ఇష్టపడే, మీ జీవితంలో ముఖ్యమైనవి  చూడటం చేయండి. ఇవన్నీ మిమ్మల్ని డిప్రెషన్‌ నుండి బయటపడేస్తాయి. మీ మనసు ఆనందకరమైన అనుభూతిని పొందుతుంది. జోక్స్‌ చదవండి. ఇలాంటివి చూస్తూ నవ్ఞ్వతూ ఉండండి. ఇవన్నీ మీ మూడ్‌మీద ప్రభావం చూపిస్తాయి.
డైరీ రాసుకోవడం వల్ల, కొద్దిరోజులు డైరీ రాసిన తరువాత ఒకసారి డైరీని జాగ్రత్తగా చూస్తే మీరు ఏఏ సమయాలలో మీ మూడ్‌ను పాడు చేసుకున్నారో మీకర్థమవ్ఞతుంది. ఇందువలన మీ మూడ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది.
తరచూ ఫంక్షన్‌లకు, షికార్లకు, మీ ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబసభ్యులతో కలిసి పోండి. ఎంజా§్‌ు చేయండి. మీరు నిరాశ, నిస్పృహలను మరిచి ఆనందంగా ఉండగలరు. మీ మూడ్‌ మారుతుంది.
మీరు మంచి మూడ్‌లో లేనపుడు మెడిటేషన్‌ చేయండి. మెడిటేషన్‌ మిమ్మల్ని దిగులు నుండి సంతోషం వైపు తీసుకువస్తుంది. నెగిటివ్‌ ఆలోచనలు తొలగి మనసు ప్రశాంతతను పొందుతుంది. మూడ్‌ బాగా లేనపుడు పూలచెట్ల మధ్యన విహరించండి. ఆ పరిమళాలు మనసును ఉత్తేజపరుస్తాయి.
ఆధ్యాత్మిక చింతనతో గడపండి, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం,  ఇలా ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపితే మనసు ప్రశాంతతను పొంది, డిప్రెషన్‌ను మూడ్‌ నుండి బయటపడతారు.
స్వచ్ఛంద సంస్థలలోను, సేవా సంస్థలలోను సభ్యునిగా చేరి సేవాకార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఇలా ఇతరులకు తోడ్పడం వలన మీ మూడ్‌ మారి మనసు రిలాక్స్‌ పొందుతుంది.

ప్రేమ


ప్రేమ 
ఎన్నో బంధాలు మనుషులను, మనసులను ఏకం చేస్తుంటాయి. ప్రతి బంధంలోనూ ప్రేమతోపాటు ఒక్కోసారి స్వార్థం, అవసరం, సందర్భాలు కూడా మిళితమయ్యే ఉంటాయి. కానీ శాశ్వతంగా 
నిలిచేది మాత్రం అనురాగభరిత వాస్తవ ప్రేమానుబంధమే. 
ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే దాన్ని సరైనవిధంగా ప్రదర్శించగలగడం కొంతైనా అవసరం. 

ప్రేమకు కొలమానం ఏది?
ప్రేమను  కొలిచేందుకు  తూనికలు, కొలతలు లేవు.  ఇక్కడ ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉందన్న నమ్మకమే కొలమానం. కేవలం యువతీ, యువకుల మధ్య ఉన్నవే ప్రేమలు కాదు.  తల్లి దండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు,  స్నేహితులు, వీరందరి మధ్యవి ప్రేమబంధాలే. 
ఆశించడం తప్పనిసరి
ఆశ లేకుండా ఏ బంధమూ ఉండదు.  ఇచ్చి పుచ్చుకోవడమనేది బంధాల్లో సాధారణం. అయితే వీటిలో ఎల్లకాలం ఇచ్చే వారొకరు, పుచ్చు కొనేవారొకరైతే కుదరదు. తాము పొందినదానికి  సమానంగా తిరిగి ఇవ్వగలిగినపుడే  చాలా బంధాలు సజావుగా సాగుతాయి. 
ప్రేమబంధాల్లో భావోద్రేకాలు
మనసులోని ఏభావమైనా ప్రదర్శించినపుడే అవతలి వారికి అర్థమవుతుంది. వారి పట్ల  ఉన్న ప్రేమాభి మానాలు ఎంత గాఢమైనవో బయట పడేంతవరకు అర్థంకాదు. అయితే మనుషులంతా భావాల్ని ఒకే రకంగా ప్రదర్శించలేరు. కొందరు పెద్దగా నవ్వడం, ఆప్యాయంగా స్పర్శించడం, ఆదరంతో తలనో, వీపో నిమరడం వంటి చర్యల ద్వారా తమలోని భావాన్ని  చెప్పగలుగుతారు.  మరికొందరు మన సులో ఎన్నో భావాల అలలు పొంగుతున్నా  పైకి మాత్రం తొణకరు బెణకరు.  
చిన్న చిరునవ్వుతోనే  తమ అంతరంగంలోని  ఆనందానుభూతులను ప్రదర్శిస్తారు. ఈ బంధాల్లో  ఒకరి పట్ల ఒకరు స్పందించే తీరు ముఖ్యమైనది.  ఇవ్వడం పుచ్చుకోవడం సహజమై నపుడు  అది ఎప్పుడు, ఎవరె వరు, ఎంతెంత అని లెక్కలు  వేస్తే ఈ బంధాలు నిలవడం కష్టం. కానీ ఏదో ఒక రూపంలో స్పందించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవెనుక నేనున్నాను అనే ధైర్యాన్ని  ఇస్తే ప్రేమ శాశ్వతమవుతుంది.

దైవప్రేమ


                       దైవప్రేమ

ఈ ప్రపంచం ప్రేమమయం. ఈ లోకంలో ప్రతి మనిషిలో ప్రేమ ఉంది. ప్రతి జీవిలో ప్రేమ ఉంది. ప్రతి ప్రాణిలో ప్రేమ ఉంది. అంతా ప్రేమమయం. అవ్యాజమైన ప్రేమ. ప్రేమే దైవం అన్నారు కొందరు. తల్లిప్రేమ, సోదరప్రేమ. భార్యాభర్తల ప్రేమ. ఇలా ప్రేమ అనేక విధాలు. తల్లిప్రేమ ఒక ఎత్తైతే దైవప్రేమ డెబ్భై తల్లుల ప్రేమతో సమానం అంటారు. దైవప్రేమ తేజోవంతమైనది. చెరగనిది. శాశ్వతమైనది. షైతాన్‌ ప్రేమ దౌర్జన్యమైనది. ఇంద్రి యలోలత్వ ప్రేమ పాపపంకిలమైనది. మనోకాంక్షా ప్రేమ కఠినమైనది.
ప్రేమ అనే విత్తనం శీతోష్ణస్థితులకు అనుగుణంగా ఎలా దినదిన ప్రవర్థమానమై ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పుష్పాలు, ఫలాలు మొదలైన వాటితో ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే అభివృద్ధి చెందాలి.
అల్లాహ్‌ ఏం కోరుతున్నాడు? నా దాసునికి నాతో ఒక గట్టి సంబంధం ఉండాలని కోరుకుంటాడు. ఈ సంబంధాన్ని మానవ మహోపకారి ముహమ్మద్‌ ప్రవక్త (స) నిజం చేసి చూపించారు. దైవం తన దాసునితో విడదీయరాని బంధాన్ని కోరుకుంటాడు. ఎప్పుడైతే బలమైన సంబంధం ఏర్పడిందో అప్పుడు అతడు ఫర్జ్‌ (విధులు) ఆరాధనలు చేస్తాడు. ప్రవక్త ప్రవచనాలను అనుసరిస్తాడు. అదనపు ఆరాధనలు (నఫిల్‌) చేస్తాడు. రాత్రింబవళ్లు ధ్యాన నిమగ్నుడవ్ఞ తాడు. ఆనందంతో శ్రమ అనేదే లేకుండా సమ యాన్ని సద్వినియోగం చేసుకుంటాడు.
నిజమైన విశ్వాసులు-అల్లాహ్‌ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్‌ ఆయతులు వారి ముందు పఠింపబడి నపుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువ్ఞనే నమ్ముకుంటారు. ఇక్కడ విశ్వాశుల నాలుగు ముఖ్య లక్షణాలను పేర్కొనడం జరిగింది. మొదటితరగతి వారు కేవలం అల్లాహ్‌కు మాత్రమే విధేయులై ఉండరు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు కూడా విధేయత చూపుతారు. మరోవిధంగా చెప్పాలంటే వారు కేవలం ఖుర్‌ఆన్‌ను అనుసరించరు. ఖుర్‌ఆన్‌తో పాటు హదీసుగా వారి హృదయాలు భీతితో కంపిస్తాయి. రెండవతరగతి వారు అల్లాహ్‌ ప్రస్తావన వచ్చినపుడు ఒక్కసారిగా వారి హృద యాలు భీతితో కంపిస్తాయి. మూడవతరగతి వారు దివ్యఖుర్‌ఆన్‌ పారాయణం వల్ల వారి విశ్వాసం (ఈమాన్‌) పెరుగుతుంది. నాలుగవ తరగతి వారు తమ ప్రభువ్ఞనే నమ్ముకుంటారు. ఇలా భక్తులు దైవం ఎడల, దైవప్రవక్త ఎడల గాఢప్రేమను, భక్తిని ప్రదర్శించుతుంటారు.     –Abdul huqq – vaartha