Saturday, 16 July 2011

من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం -  
- عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.

అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు - నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.


వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు.  ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃

1.ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి అవ్వలుహు, ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో - మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.  
3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.

من آداب العطاسఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి  -

عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హందులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్,  ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.
అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్  అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్  అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్  అని పలకవలెను.

వివరణ:- హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును 

No comments:

Post a Comment