Wednesday, 13 July 2011

aanandangaa undaalante......


ఒక క్షణం ఆనందం, మరోక్షణంలో దిగులు దీనికి కారణం ఏమిటి? మన మూడ్‌ ఎప్పటికప్పుడు మారుతూ ఉండటమా? ఇలా మారడానికి కారణం ఏమిటి? మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలే మూడ్‌ మారటానికి కారణమని, మన శరీరంలో విడుదలయ్యే అమినోయాసిడ్స్‌ వల్లే మన ఉద్వేగాలు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక స్థాయిలో అవి ఆందోళనను కలిగిస్తాయి. మరో స్థాయిలో భయం, ఇంకో రసాయనం కలిస్తే కోపం. కొన్నిసార్లు ఆశావాదం, అంతలోనే నిరాశావాదం రావడం. ఇలా మూడ్‌ మారిపోవడం సహజమే. ఒకేరకమైన మూడ్‌ తరచూ రావడం, ఒకే రకమైన మూడ్‌లో కొద్దికాలం గడపడం ప్రమాదకరం. ఇలా జరగడం వల్ల మన వర్క్స్‌, మన అనుబంధాలు, స్నేహాలు, మన రూపురేఖలు కూడా మారతాయి. ఇందువల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నెగిటివ్‌ ఆలోచనలు ఎక్కువవ్ఞతాయి. వాటిని అధిగమించడానికి కొన్ని పద్ధతులను పాటించండి ఇలా!

 
మూడ్‌ సరిగా లేనపుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించవద్దు. ఇలా చేస్తే ఇంకా కృంగిపోయే అవకాశముంది. ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో కలిసి పోయి మాట్లాడుతూ ఉంటే వారి సమస్యలు వింటూ ఉంటే, మన సమస్యలు చాలా చిన్నవిగా, సులువ్ఞగా పరిష్కరించుకోగలిగేలా ఉంటాయి.
 మీ మూడ్‌ బాగాలేనపుడు మీ దృష్టిని వేరే విష యాలమీద మరల్చండి. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌, ఫన్నీషో ఏదైనా ఫరవా లేదు. ఇష్టమైనవినడం, పుస్తక పఠనం ఇలాంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
నిరాశగా ఉన్నపుడు ఏకాగ్రత ఉండదు. ఏ పని మీద దృష్టి ఉంచలేరు. అటువంటి సమయాలలో ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీద మనసు లగ్నం చేయండి. శ్వాసమీద దృష్టిని ఉంచి, శ్వాస క్రమబద్ధంగా జరిగేలా చూడండి. ఇలా కొద్దిసేపు చేసినట్లయితే మీ మూడ్‌ మారి ప్రశాంతతను పొందుతారు.
జుట్టు పీక్కోవాలనంత చికాకుగా ఉంటే, జుట్టుకు నూనె రాసుకుని మీకిష్టమైన షాంపూతో స్నానం చేయండి. వీలైతే స్నానపు నీళ్లలో పరిమళాలు వెదజల్లే వాటిని కలపండి. ఇవి మిమ్మల్ని తాజా పరిమళాలతో, సరికొత్త వాతావరణంలోకి తీసుకెళతాయి.
మూడ్‌ బాగాలేనపుడు ఏదో ఒక పనిలో నిమగ్నం కండి. మీ మనసు ఊరట పొందుతుంది. గదిని శుభ్రం చేయటంలోనూ, షెల్ఫును సర్దడం లోనూ వివిధ వస్తువ్ఞలను అమర్చడంలోనూ ఇలా ఏదో ఒక పనిలో బిజీ అయిపోండి. దీని వలన మీ స్తబ్దత తొలగి రిలాక్స్‌ అవ్ఞతారు.
నిశ్చలంగా ఒక దగ్గరే ఉండకుండా నడవండి, కూర్చోండి, పడుకోండి, పరుగెత్తండి. శరీరం మొత్తం కదిలేలా మీకిష్టమైన  ఎక్సర్‌సైజులు చేయండి. ఇవన్నీ మీ మెదడు మీద ప్రభావం చూపించి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
మూడ్‌ బాగాలేనపుడు మీ హాబీని కొనసాగించండి. కుట్టికలో, అల్లికలో, పెయింటింగ్‌లు వేయడం, చిత్రాలు గీయడం, రచనావ్యాసంగం, ఇష్టమైన పాటలు వినడం, మీకిష్టమైన ఫొటో ఆల్బమ్‌లను మరలా చూడటం, మీరు ఇష్టపడే, మీ జీవితంలో ముఖ్యమైనవి  చూడటం చేయండి. ఇవన్నీ మిమ్మల్ని డిప్రెషన్‌ నుండి బయటపడేస్తాయి. మీ మనసు ఆనందకరమైన అనుభూతిని పొందుతుంది. జోక్స్‌ చదవండి. ఇలాంటివి చూస్తూ నవ్ఞ్వతూ ఉండండి. ఇవన్నీ మీ మూడ్‌మీద ప్రభావం చూపిస్తాయి.
డైరీ రాసుకోవడం వల్ల, కొద్దిరోజులు డైరీ రాసిన తరువాత ఒకసారి డైరీని జాగ్రత్తగా చూస్తే మీరు ఏఏ సమయాలలో మీ మూడ్‌ను పాడు చేసుకున్నారో మీకర్థమవ్ఞతుంది. ఇందువలన మీ మూడ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది.
తరచూ ఫంక్షన్‌లకు, షికార్లకు, మీ ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబసభ్యులతో కలిసి పోండి. ఎంజా§్‌ు చేయండి. మీరు నిరాశ, నిస్పృహలను మరిచి ఆనందంగా ఉండగలరు. మీ మూడ్‌ మారుతుంది.
మీరు మంచి మూడ్‌లో లేనపుడు మెడిటేషన్‌ చేయండి. మెడిటేషన్‌ మిమ్మల్ని దిగులు నుండి సంతోషం వైపు తీసుకువస్తుంది. నెగిటివ్‌ ఆలోచనలు తొలగి మనసు ప్రశాంతతను పొందుతుంది. మూడ్‌ బాగా లేనపుడు పూలచెట్ల మధ్యన విహరించండి. ఆ పరిమళాలు మనసును ఉత్తేజపరుస్తాయి.
ఆధ్యాత్మిక చింతనతో గడపండి, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం,  ఇలా ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపితే మనసు ప్రశాంతతను పొంది, డిప్రెషన్‌ను మూడ్‌ నుండి బయటపడతారు.
స్వచ్ఛంద సంస్థలలోను, సేవా సంస్థలలోను సభ్యునిగా చేరి సేవాకార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఇలా ఇతరులకు తోడ్పడం వలన మీ మూడ్‌ మారి మనసు రిలాక్స్‌ పొందుతుంది.

No comments:

Post a Comment