Wednesday, 11 June 2014

కన్న కలలు కల్లలాయె…


(దగా పడ్డ ఈ దీనురాలి దయనీయ గాథ)
”ట్రుంటు ట్రూం, ట్రుంటు ట్రూ” నోకియా రింగ్‌ టోన్‌లో మొబాయిల్‌ మ్రోగసాగింది. ఇల్లు తుడుస్తున్న లీనా పరుగెత్తుకుని వెళ్ళి ఫోన్‌ రిసీవ్‌ చేసింది.
”హెలో గుడ్‌ మార్నింగ్‌! నేను వతనియా ఆవ¦ీసు నుండి అయిషాని మాట్లాడు తున్నాను. లీనా గారితో మాట్లాడాలి” (ఉర్దూలో మాట్లాడుతుంది ఆ అమ్మాయి)
”ఆఁ, ఆఁ నేను లీనానే మాట్లాడేది”
”కంగ్రాచ్యులేషన్స్‌, మీకు మువ్పై వేల దీనార్ల లాటరీ వచ్చింది….” ఉలిక్కి పడింది లీనా. ఆ వెద్ద ‘షాక్‌’ నుండి తేరుకుంటూ ఆలోచించసాగింది. తనకు ఉర్దూ వచ్చా రాదా? ఆ ఫోన్‌లోని స్వరాన్ని తను సరిగా అర్థం చేసుకోగలిగిందా? ”తీస్‌ హజార్‌ దీనార్‌!” అంటే మువె¦్ౖప వేల దీనార్లే కదా!
”నేనేమి వింటున్నాను, ఇది   కలా నిజమా?”  నా మెదడులో ఉన్న డబ్బు విచ్చి చెవుల్లో ఈ రూపంలో మారుమ్రోగడం లేదు కదా” ఊహాలోకాల్లో తేలిపోతోంది లీనా. అంతలో ”మీరు టీ.వి చూడడంలేదా? మేము నాలుగు రోజులుగా మీ వేరున లాటరీ వచ్చిందని ప్రకటిస్తున్నాం”.
”నాకదేం తెలియదే! నేనసలు టీ.వి చూడనండీ, అప్పుడప్పుడు తీరిక ఉన్నప్పుడే చూస్తాను”.
”మీకు కేష్‌ కావాలా, చెక్‌  కావాలా?”
”ఇదేంటీ? నేనింత అదృష్టవంతురాలినా? జీవితాంతం ఇండ్లలో పనిచేసి బ్రతికిన నాకు మువె¦్ౖప వేల దీనార్లా! ఓ అల్లాహ్‌ా! నావై ఒక్కసారే ఇంతగా దయ దలిచావా? నిజంగా నీవు కరుణామయుడివి. అమ్మయ్య! హాయిగా ఇండియాకెళ్ళిపోతాను, నా రెక్కలు సుఖపడే సమయమొచ్చేసింది.” క్షణంలో రక రకాల కలలు…రకరకాల  ఆలోచనలు ముసురు కున్నాయి. ”ఓ దేవుడా! ఇది నిజమా?” అని గట్టిగా అరచినట్లడిగింది.
”సిస్టర్‌! ఇది నూటికి నూరు పాళ్ళు నిజం, మీరు నమ్మలేకున్నారు కదూ! ఒక పని చేయండి, మీ వద్ద ఒకవేళ లాన్డ్‌ లైనుంటే దాంతో నా నెంబరువై ఫోన్‌ చేయండి. మీ మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ తీసి నెంబరు చూసుకోండి. మీ నెంబరు 9636.” ఆమె చెవ్పినట్లు అలాగే లాండ్‌లైన్‌తో ఆమెకు ఫోన్‌ చేసింది లీనా. పాపం తనకు ఆ నెంబరు చూడడం తెలియదు.  హడావిడిగా తన ఇంగ్లీషు బాస్‌ వద్దకు వెళ్ళి నెంబరు చూడమని ప్రాధేయపడింది. అతను ఎందుకన్నట్లు ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూస్తూ నెంబరు చెప్పసాగాడు. (ఆ నెంబరు అమ్మాయి చెవ్పిందే) అరే నిజమే ఆ నెంబరే! ఉంది. ఆ అమ్మాయి మాటలవై పూర్తిగా నమ్మకం కుదిరింది లీనాకు. ”ఇప్పుడేం చేయాలి నేను?” అనడిగింది లీనా.
”మీకు కువైట్‌లో బ్యాంక్‌  అకౌంట్‌ ఉందా?”
”లేదు”
”ఐతే ఇప్పుడే ఏ షాపు నుండైనా పది పది దీనార్ల  27 వతనియా కార్డులు కొని వాటి నెంబర్లను మాకు తెలియ పరచాలి,  వెంటనే మేము మీకు డబ్బు ఏర్పాటు చేస్తాం”.
”ఇప్పుడే ఎలా కుదురుతుంది? కాసేపు ఆగి వెళతాను. నేనుండే ఇంటికి షాపు చాలా దూరంగా ఉంది” అంది లీనా. కాని ఆమె ఒప్పుకోలేదు. ”నేను లైనులో ఉంటాను. మీరు నాతో మాట్లాడుతూ వెళ్ళండి, కొని తీసుకు రండి” అని పురమాయించింది.
లీనా అబాయా వేసుకొని త్వరత్వరగా తన అకామా కోసం దాచివెట్టిన 800 వందల దీనార్లలోనుండి 270 దీనార్లు తీసి,  బఖాలా నుండి 27 కార్డులు కొని, వారికి    నెంబర్లు
చెవ్పింది. (ఇలా   ఏవ్రిల్‌ నెల 2010 8 వ తేదిన  పంవింది) నెంబర్లు తీసుకోగానే ఆ అమ్మాయి ఇలా అంది: ”ఒక విషయం సిస్టర్‌! దీనిలో ఇతరులను ఇన్వాల్వ్‌ చేయకూడదు, మాకు మరెవ్వరితోనూ పనిలేదు. మేము మీతోనే డయిరెక్ట్‌గా సరప్రదిస్తాము. మీరు మెసేజెస్‌ చూస్తూ ఉండండి. మరి ఫోన్‌ రిసీవ్‌ చేస్తూ ఉండండి, హేవ్‌ ఎ నైస్‌ డే” అని వెట్టేసింది.
”యా రబ్బీ! నీవు అపార  కరుణా మయుడివి, ఊహకందని చోటు నుండిస్తావు” అంటూ   కళ్ళు  మూసుకుని గట్టిగా గాలి వీల్చుకుంది లీనా. తను బయటకు వెళ్ళడం, రావడం, నెంబర్లు చెప్పడం అంతా కన్నార్పకుండా చూస్తూ ఆమెను గమనిస్తు న్నాడు ఆమె బాస్‌. కాసేపటికి తన లోకంలో నుండి బయటపడి చుట్టూ చూడగానే తననే చూస్తున్న బాస్‌ను చూసి ఖంగు తిన్నది లీనా. బాస్‌కు ఈ విషయం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది క్షణం. తరువాత ఎలాగైనా చెవ్పడం మేలనుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ పూర్తి విషయాన్ని అతనికి వివరించింది. అంతా విని ‘ఇలాంటి విచ్చి పనుల్లో తల దూర్చకు, ఇదంతా ఫ్రాడ్‌, లాటరీ వస్తే వతనియా వారికి డబ్బు చెల్లించడమేమిటి? ఇవన్నీ పబ్లిక్‌తో డబ్బు లాగే ట్రిక్కులు” అని మందలించాడు. అతని ముందు తల ఊవింది, కాని తన లోపల మాత్రం తనకు పూర్తి నమ్మకం. తను ధనికురాలైపోయింది. ఇక ముందు తనకే లోటూ ఉండదు, అన్ని కష్టాలకు ఇక స్వస్తి’ – వైకి మాత్రం ఏమీ చెప్పలేదు. అంతలోనే వారివురి మధ్య ఆవరించిన నిశ్శబ్దాన్ని చీలుస్తూ మెసేజ్‌. మెసేజ్‌లో తనకు మువె¦్ౖప వేల దీనార్ల లాటరీ వచ్చిందని, దానికి వతనియా వారు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారని ఉంది. (ఆ మెసేజ్‌ నెంబరు 60641262).
తను ఆ మెసేజ్‌ని తన బాస్‌కు చూవించింది, బాస్‌ దాన్ని నమ్మాలో, నమ్మకూడదో సందేహంగా తేల్చుకోలేక పోయాడు.  కార్డులు పంవించిన క్షణం నుంచీ లీనా అందమైన ఊహా లోకంలోనే విహరిస్తోంది. ప్రతి అర్థ గంటకు ఫోన్‌ మ్రోగుతూ ఉంది. ఈసారి మళ్ళీ ఉత్కంఠ.
”పాకిస్తానీ మేనేజర్‌ మీకు శుభాకాంక్షలు తెలియ పరచాలను కుంటున్నారు” అని ఫోన్‌ అతనికిచ్చింది.  ”బహుత్‌ బహుత్‌ ముబారక్‌” అని చెవ్పి 800 దీనార్లు కట్టి రసీదు తీసుకోండి అన్నాడు మేనేజర్‌. 800 దీనార్లే? మొన్ననే పది పది దీనార్ల కార్డులు అని కట్టించుకున్నారు. మళ్ళీ అంత డబ్బా, ఓ అల్లాహ్‌ా! ఏం చేయాలి? డబ్బు కావాలంటే డబ్బు చెల్లించాలి. తన వద్ద లేదు కాబట్టి తన బాస్‌కు అప్పు ఇవ్వమని అడిగింది. 20 సంవత్సరాలుగా వారింట్లో పని చేస్తుంది కానీ ఎప్పుడూ అలాంటి అవసరం రాలేదు. తను అడగలేదు కాని ఈ సిచ్యువేషన్‌ వేరు. …మొత్తానికి తన యజమాని నుండి డబ్బు తీసుకుంది. తను కృతజ్ఞతలు తెలుపుకుని ‘అల్‌ ముల్లా ఎక్స్‌ంఛేజ్‌’ లో కట్టమని వతనియా వాళ్ళు పోన్‌ చేసి చెవ్తే కట్టింది. తనకు ఒక విషయంలో చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఏ బ్యాంకి వేరూ, అడ్రసు ఏమీ లేకుండా ఒక వ్యక్తి ఎలా డబ్బు తీసుకోగలడు? ”ముహమ్మద్‌ సులైమాన్‌, సన్‌ ఆవ¦్‌ ముహమ్మద్‌ సులైమాన్‌, పాకిస్తాన్‌.”  వేరిట చెక్కు కట్టించుకున్నారు వాళ్ళు. (ఆనాడు కట్టిన డ్రాప్టు నెంబరు – 6531924598) తన సందేహాన్ని బేంక్‌లో అడిగింది. దానికి వారు ”ఆ వేరిట చెక్‌ పంవిస్తే అతను పాకిస్తాన్‌లో ఏ బ్యేంకీ నుండైనా తీసికోగలడు” అన్నారు. అతను చాలా వలుకుబడి ఉన్న వ్యక్తి కాబోలు అనుకుంది లీనా. బాస్‌ చెవ్పినట్లు వీళ్ళు ఫ్రాడ్‌ ఆయి ఉండవచ్చు అన్న అనుమానం మాత్రం రాలేదు ఆ పిచ్చి తల్లికి.
డబ్బు అందిన తరువాత కృతజ్ఞతగా మెసేజ్‌ వచ్చింది. తను పొంగి పోయింది వారి ఎటికేట్స్‌ చూసి. డబ్బు కట్టిన తరువాత ”ఇక్కడకొచ్చి మీ చెక్‌  తీసుకోండి, అని మెసేజ్‌ వస్త్తుందో లేక ఫోన్‌ మ్రోగు తుందోనని వేయి కళ్ళతో నిరీక్షిస్తుండగా మొబైల్‌ మ్రోగింది, మొదటి రింగ్‌కే ఆదుర్దాగా రిసీవ్‌ చేసింది లీనా, అది పాకిస్తాన్‌ నుండి, కంగ్రాట్స్‌ చెవ్పి (800 దీనార్లు అడిగిన వ్యక్తి) మరలా చాలా తీయగా మాట్లాడి ”మీకు చాలా వెద్ద అమౌంట్‌ వచ్చింది కాబట్టి మీరు 750 దీనార్లు ఒకటి, 400 దీనార్లు, 402 దీనార్లు వేర్వేరుగా పంవించాలి. ఇది మీకు ఇవ్వబడే అమౌంట్‌ యొక్క టేక్స్‌. అది కట్టకపోతే డబ్బు తీసుకోవడం వీలు కాదు” అన్నాడు.

ఓ అల్లాహ్‌! ఇప్పుడే డబ్బు కట్తిని, మళ్ళీ ఎక్కడ్నుంచి వస్తుంది? (తను ఒక ఇంట్లో మేయిడ్‌గా పని చేస్తుందని, ఇప్పటి వరకు పంవిన డబ్బు అప్పు తీసికుని పంపానని మళ్ళీ అంత డబ్బు కట్టలేనని ప్రాధేయ పడింది. కాని అతను, నేను కూడా అశక్తుణ్ణనీ, ఇదీ కంవెనీ నిర్ణయం గనక మీరు కట్టాల్సిందే, సిస్టర్‌! ఎలాగో చేసి కట్టేయండి  త్వరలోనే మీ చెక్‌ మీకొస్తుంది కదా! వెంటనే  పంవించాలి, పంవించక పోతే మేము బాధ్యులము కాము” అన్నాడు. అతను అర్జెంట్‌ అంటూంటే రెండ్రోజుల గడువు తీసుకుంది.
ఆ తరువాత డబ్బు కలెక్ట్‌ చేయడానికి తను పడిన కష్టాలు తనకే తెలుసు.  ఆనాడు నిజంగా తనకి తెలిసి వచ్చింది- తను చేసిన తప్పు. కుమిలి కుమిలి ఏడ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అకామా డబ్బు తప్ప. ఇప్పుడే బాస్‌ వద్ద 800 దీనార్లు బాకీ.  మువె¦్ౖప వేల దీనార్లు వస్తాయన్న ధీమాతో ఇంతకి తెగించింది.  కాని డబ్బు జాడలేదు. ఇప్పుడేం చేయగలదు. సరిదిద్దుకునే చాన్స్‌ లేదు, డబ్బు పంవించకపోతే వారు బాధ్యులు కారంట. కట్టకపోతే ముందు పంవిన సొమ్ము నట్టేటిలో మునిగినట్లే అనుకుని ఎలాగో ఇది     చివరిసారి    కదా    అని మళ్ళీ నడుం కట్టింది. అందరు స్నేహితురాళ్ళ వద్ద చందా ఎత్తినట్లు ఒకరి వద్ద నుండి 100, 50, 20, 10 తెలిసినవారందరి దగ్గరా తీసికుని, తన వద్ద అకామా కోసం మిగిలిన డబ్బు అంతా కలివి మూడు డ్రాప్టులుగా  పంవించింది. ( ఆ డ్రాప్టు నెంబర్లు 750 కెడీస్‌, 8137666130, 402 కెడీస్‌, 5896797955, 400 కెడీస్‌, 5590256448) ఇంత డబ్బు పంవే ముందు కనీసం ఈసారన్నా ఎవరినయినా అడుగుదాం, ఏం చేయాలో సలహా తీసుకుందాం అని కూడా ఆలోచించక డబ్బు పంవించేసి పూర్తిగా దివాలా తీసింది. ఆశగా ఎదురు చూస్తోంది, తన ఆశలు అడియాసలౌతాయని కించిత్తు కూడా అనుకోలేదు పాపం. 2,750 దీనార్లు లాటరీ వేరున పంవించి, నిద్రాహారాలు మాని తన తెలివి తక్కువ పనిని ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతోంది. తను ఫోన్‌ చేస్తే రిసీవ్‌ చేసేవారెవరూ లేరు. ‘ఆ పాకిస్తానీ నెంబరుకు (ఇంటర్నెట్టుతో ఫోన్‌ చేస్తే నో రెస్పోన్స్‌’. ఒకసారి తను ఫోన్‌తో చేస్తే చక్కగా మాట్లాడాడు, ”మీరు భయపడకండి సిస్ట్టర్‌! మీ డబ్బులు ఎక్కడికీపోవు చాలా త్వరగా వచ్చేస్తాయి” ఆని హామీ ఇచ్చి మరో 150 దీనార్లు పంపమని కోరాడు. అయ్యో! ఇంకా నూట యాభై దీనార్లా! సిగ్గులేదా వాడికి అనుకుంది. ”భాయి ఇలా చేయడం మీకన్యాయం! వేదరాలిని. పుట్టెడు అప్పులైపోయాయి. కాస్త కనికరించి పంవించండి   మీకు మీ విల్లలకు జీవితాంతం రుణపడి ఉంటాను, దుఆ చేస్తాను.  ఆ లాటరీ డబ్బు కాక పోయినా నేను పంవిన డబ్బే నాకు పంపండి” అని వలవలా ఏడుస్తూ విన్నవించుకుంటూ ఉంటే ఫోన్‌ కట్‌ చేసేసాడు. అయి పోయింది పాలూ నీరూ తేలిపోయింది. దుర్మార్గులు వేద దాని రక్తం వీల్చుకున్నారు.
ఇక ఈమె ఏడ్పులూ రోదనలూ వారికి అనవసరం. మొబైల్‌ నిశ్శబ్దమైపోయింది. కొంత మంది కర్కశులు, మనుషులుగా జన్మించి కూడా అణువంత కరుణ లేకుండా ప్రజల పాలిట జలగలై జీవిస్తారు. అంత వెద్ద మోసం చేయడానికి ఎంత వెద్ద ముఠా తయారై ఉంటుందో కాస్త ఆలోచించండి!
”సోదర సోదరీమణులారా !
ఇది ఒక్క లీనాయే కాదు, ఈ కువైట్‌లో ఇంకెందరో అభాగ్యులు ఇలాగే మోసపోయి జీవచ్ఛవాల్లా జీవిస్తూ ఉండవచ్చు”. ఈ ముప్పు ఒక కనువిప్పు. అల్లాహ్‌ా సుబ్‌హానహూ వ తఆలా దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా ప్రకటించాడు:
”విశ్వాసులారా ! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం – ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్‌ పనులు. వాటిని విసర్జించండి. మీకు సావ¦ల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది.” (అల్‌ మాయిద: 90)
ఏదైనా ఒక క్రొత్త పని లేక తెలియని పని ప్రారంభించినప్పుడు ఇతరుల సలహా తీసికోవడం ఉత్తమం. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:
”(విశ్వసించి, తమ ప్రభువునే నమ్ముకున్న భక్తులు) తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. తమ వ్యవహారాలలో పరస్పరం సంప్రదించుకుని ఒక అవగాహనకు వస్తారు….” (అష్‌ షూరా – 38)
వై సూక్తి ప్రకారం పరస్పరం సలహా తీసుకోవాలని వ్రేరేవించబడినది. సలహా తీసికునే వారి కార్యాలలో  శ్రేయాన్ని, అల్లాహ్‌ా సమృద్ధిని పొందు పరుస్తాడు. సలహా  వల్ల మనం సత్యానికి దగ్గరౌతాము, ఇతరుల అభిప్రాయాలూ, అనుభవాల వెలుగులో మంచి నిర్ణయానికి వస్తాము. అంతే కాకుండా వ్రేమాభిమానాలు వెరుగుతాయి.  సలహా, మనిషిని  అహంభావం, పొగరుకు దూరంగా ఉంచుతుంది. సలహా తీసుకొనే వారికి ఎప్పుడూ అవమానం లేక వైవ¦ల్యమనేది ఉండదు. సలహా చెడు పరిణామాలను అరికట్తుంది. కనుక సలహా సంప్రతింపులు చాలా అవసరం. లీనా కూడా ఒకవేళ ఎవర్నన్నా సంప్రదించి ఉంటే తను ఇలా మోసపోయి ఉండేది కాదు. (అల్లాహ్‌ ఆమెకు సహనమివ్వుగాక మరియు కష్టాలను దూరం చేయుగాక. ఆమీన్‌)

ప్రథమ ఖలీఫా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)


దైవ ప్రవక్త (స) పరమ పదించిన తరువాత ఆయన వారసులుగా నలుగురు అనుచరులు ఖలీఫాలు అయ్యారు. ఆ నలుగురు : 
(1) హజ్రత్‌ అబూ బకర్‌ సిద్దీఖ్‌ (రజి)
(2) హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (రజి)
(3) హజ్రత్‌ ఉస్మాన్‌ గని (రజి)
(4) హజ్రత్‌ అలీ (రజి).
ఈ నలుగురినే ఖులఫాయె రాషిదీన్‌ (సన్మార్గగాములైన ఖలీఫాలు) అంటారు. అరబీ భాషలో ఖలీఫా అంటే ప్రతినిధి, వారసుడు అని అర్థాలున్నాయి. ఖలీఫాకు బహు వచనం ఖులఫా. రాషిద్‌ అంటే సన్మార్గంలో నడిచేవాడని అర్థం. రాషిద్‌కు బహువచనం రాషిదీన్‌. ఖులఫాయె రాషిదీన్‌ అంటే సన్మార్గగాములైన ప్రతినిధులు అని అర్థం. మన ప్రియ ప్రవక్త (స) దైవాభీష్టం ప్రకారం ఇస్లామీయ వ్యవస్థను ఏవిధంగా నడిపారో ఆ నలుగురు ఖలీఫాలు కూడా అదే విధంగా పరిపాలన చేశారు. వారు తమ తరఫున ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఆ నలుగురు ధర్మ ఖలీఫాలలో మొదటివారు హజ్రత్‌ అబూ బకర్‌ సిద్దీఖ్‌ (ర).
అసలు వేరు : అబ్దుల్లాహ్‌ (అబూ బకర్‌గా విలువబడ్డారు)
బిరుదులు : సిద్దీఖ్‌, అతీఖ్‌
తండ్రి వేరు : ఉస్మాన్‌ (అబూ ఖహాఫాగా విలువబడ్డారు)
తల్లి వేరు : సల్మా (ఉమ్ముల్‌ ఖైర్‌గా విలువబడ్డారు)
తండ్రి తండ్రి వేరు : ఆమిర్‌, తల్లి తండ్రి వేరు : సఖర్‌
వంశం: ఖురైష్‌ తెగలోని ఉప తెగ బనూ తమీమ్‌కు చెందినవారు. మక్కా ప్రజలు తమీమ్‌ తెగవారిని ఎంతగానో గౌరవించే వారు. ఆయన వంశావళి ఆరవ సంతతిలో దైవప్రవక్త (స) వంశంతో కలుస్త్తుంది. తల్లి సల్మా (రజి) గారు ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. తండ్రి మక్కా విజయం తర్వాత ఇస్లాం స్వీకరించారు.
పుట్టుక, బాల్యం
హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) క్రీ. శ. 573 జూన్‌ నెలలో జన్మించారు. ప్రవక్త మహనీయులకన్నా రెండున్నర సంవత్సరాలు చిన్నవారు. చిన్నప్పటి నుండి ప్రవక్త (స) గారిని అనుసరించేవారు. బాల్య మిత్రులు కూడా. ప్రవక్త (స) ఎంతో బిడియస్తులు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) కూడా అశ్లీల విషయాలను అసహ్యించుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్ననాటి నుంచే ఎంతో మంచివారుగా, దయార్ధ్ర హృదయులుగా, పరోపకారిగా, వెద్దలను గౌరవించే వ్యక్తిగా వేరుపడ్డారు. అందుచేత మక్కావాసులు ఆయన్ని ఎంతగానో అభిమానించేవారు, గౌరవించేవారు.
చిన్ననాటి నుండే బహుదైవారాధనకు దూరంగా ఉండేవారు. ఆయన ఇంట్లో ఒక గదిలో విగ్రహాలు ఉండేవి. ఇంట్లో వారంతా విగ్రహాలను పూజించేవారు. ”ఒక సారి మా నాన్నగారు నన్ను విగ్రహాలున్న గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక విగ్రహాన్ని చూవిస్తూ ‘ఈ విగ్రహమే నీ దేవుడు. దీని ముందు సాష్టాంగపడు’ అని చెప్పారు. నేనా విగ్రహం దగ్గరికెళ్ళి ‘నాకు ఆకలిగా ఉంది అన్నం తెవ్పించు’ అన్నాను. కానీ విగ్రహం మాట్లాడలేదు. తర్వాత ‘నాకు బట్టలు కావాలి తెచ్చివ్వు’ అన్నాను మళ్ళీ, దానికి విగ్రహం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి నేను ఒక రాయి తీసుకొని ‘చూడు, నేనిప్పుడు నిన్ను ఈ రాయితో కొడ్తాను. చేతనైతే నిన్ను నీవు కాపాడుకో’ అని చెప్పాను. దానికీ ఆ విగ్రహం నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు నేను ఆ రాయిని దాని తల మీద బలంగా విసిరికొట్టాను. దాంతో అది బోర్లా పడి పోయింది” అని స్వయంగా తెలిపారు. నిజమే మరి! విగ్రహాలు ఎలాంటి శక్తీ లేనివి. భక్తులకు సహాయం చేయడం అటుంచి, తమకు తామే సహాయం చేసుకోలేవు. అందువల్ల వాటిని పూజించడం వ్యర్థమని తలంచారాయన.
యువకుడిగా ఆయన వ్యక్తిత్వం:
మంచితనం, పరోపకార స్వభావం వల్ల ఖురైష్‌ తెగలోని ప్రతి మనిషీ ఆయన్ను ఎంతగానో అభిమానించేవాడు. వంశంలో ఎవరైనా హత్య చేయబడితే ఆ వ్యవహారం హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారికి అప్పగించబడేది. ఆ వ్యవహారాన్ని ఎంతో నేర్పుగా పరిష్కరించేవారు. ఆ తీర్పు ఉభయులకూ సంతోషాన్ని కలిగించేది. జీవనోపాధి కోసం ఆయన వ్యాపారం చేసేవారు. ఆయన నిజాయితీకి ప్రజలు ఎంతగానో ప్రభావితులయ్యేవారు. అనతి కాలంలోనే మక్కా ధనికుల్లో ఒకరయి పోయారు. ఆయన వ్రియ ప్రవక్త (స) గారితో కలిసి అనేక వాణిజ్య పర్యటనలు జరిపారు.
ముహమ్మద్‌ (స) గారు దైవ ప్రవక్తగా నియమించబడిన తర్వాత తన దగ్గరి బంధు మిత్రులకు ఇస్లాం సందేశం అందజేయడం ప్రారంభించారు. తన కుటుంబీకుల తర్వాత మొదటగా అబూ బకర్‌ (రజి) గారికి ఇస్లాం సందేశం అందజేశారు. సందేశం వినగానే ఎలాంటి తటపటాయింపు లేకుండా వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన స్వేచ్ఛాపరులైన పురుషులలో మొదటివారై చరిత్రలో చిరస్మరణీయులైనారు. అప్పటికి ఆయనగారి వయస్సు 37 సంవత్సరాలు.
ధర్మప్రచారం
హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) ఇస్లాం స్వీకరించగానే ఇతరులు కూడా తనలాగే ఇస్లాం స్వీకరించి అల్లాహ్‌ా వ్రియదాసులలో చేరిపోతే బాగుంటుందని మధన పడేవారు. తన స్నేహితులకు ధర్మాన్ని పరిచయం చేసేవారు. ప్రవక్త (స) అనుమతితో జన సమూహాలలో బహిరంగంగా ప్రచారం చేయడం మొదలెట్టారు. సత్య తిరస్కారులు ఒక్కసారిగా ఆయనవై విరుచుకుపడి చితకబాదేవారు. దాంతో ఆయన రక్తసిక్తమై స్పృహ తవ్పి పడిపోయేవారు. స్పృహ రాగానే ప్రచారం మొదలెట్టేవారు. ”సోదరులారా! మనకు, యావత్తు విశ్వానికి సృష్ట్టికర్త, స్వామి, ప్రభువు, యజమాని అల్లాహ్‌ా మాత్రమేనని, ఆయనే మనకు ఉపాధి ఇస్తున్నాడని, చివరికి మనమంతా కర్మల విచారణ కోసం ఒక రోజు ఆయన దగ్గరికే పోవలసి ఉంద”ని తనదైన శైలిలో చెవ్పేవారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారి బోధనలకు ప్రభావితులై ఇస్లాం స్వీకరించిన ప్రముఖులు :
(1) హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ అప్ఫాన్‌ (రజి) (2) హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌ (రజి)
(3) హజ్రత్‌ అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ఔఫ్‌ (రజి) (4) హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబీ వఖ్ఖాస్‌ (రజి)
(5) హజ్రత్‌ తల్హా బిన్‌ అబ్దుల్లాహ్‌ా (రజి) (6) హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ మజ్‌వూన్‌ (రజి)
(7) హజ్రత్‌ అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్‌ా (రజి)
(8) హజ్రత్‌ అబూ సలమా(రజి)
(9) హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ సయీద్‌ బిన్‌ ఆస్‌ (రజి).
ధర్మ ప్రచారం కోసం ప్రవక్త (స) గారికి కావలసిన వైకమంతా హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారే సమకూర్చేవారు. ఇస్లాం కోసం తన యావత్‌ సంపాదనను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసేవారు. ఏమాత్రం వెనకాడేవారు కాదు. బానిసలలో చాలా మంది ఇస్లాం స్వీకరించారు. ఈ కారణంగా వారి అవిశ్వాస యజమానులు వారిని శరీరం గగుర్పొడిచే విధంగా చిత్రహింసలు వెట్టేవారు. హజ్రత్‌ అబూబకర్‌ (రజి) ఈ పరిస్థితిని చూసి చలించిపోయేవారు. వారి యజమానులతో మాట్లాడి వారడిగినంత వైకం చెల్లించి కొని వారికి స్వేచ్ఛను ప్రసాదించారు. అలా స్వేచ్ఛను పొందిన వారిలో ముఖ్యులు :
(1) హజ్రత్‌ బిలాల్‌ (రజి),
(2) హజ్రత్‌ నజీరా (రజి),
(3) హజ్రత్‌ బిన్త్‌ నహ్‌ాదియా (రజి),
(4) హజ్రత్‌ ఆమిర్‌ బిన్‌ ఫుహైరా (రజి), (5) హజ్రత్‌ జారియా(రజి)
ఇస్లాం ధర్మ ప్రచారంలో ప్రవక్త (స) గారికి వెన్నంటి ఉండి అల్లరి మూకల నుండి విరుచుకుపడే అఘాయిత్యాల నుండి రక్షణ కవచమై నిలిచేవారు. ఈ ప్రయత్నాలలో రక్త సిక్తమయ్యేవారు కానీ ప్రవక్త (స) గారివై ఈగను సైతం వాల నిచ్చేవారు కాదు.
ప్రవక్త (స) గారి వెంట మదీనాకు వలస (హిజ్రత్‌)కు తన సర్వాన్నీ వదలి బయలు దేరారు. దారిలో సౌర్‌ గుహలో 3 రోజులు గడపవలసి వచ్చింది. ప్రవక్త (స) గారు అబూ బకర్‌ (రజి) గారి తొడమీద తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక కన్నంలో నుండి పాము బయటికి రావడాన్ని గమనించి ఎక్కడ ప్రవక్త (స) గారిని కాటేస్తుందోనని తన కాలిని అడ్డం వెట్టారు. ఆ పాము తనను కాటేసింది. అయినప్పటికీ భయంకరమైన బాధను భరించారేగాని ప్రవక్త (స) గారికి నిద్రాభంగం కానివ్వలేదు. బాధతో కళ్ళ నుండి కారే కన్నీరు ప్రవక్త (స) గారి చెక్కిళ్ళవై పడ్డాయి. ప్రవక్త (స) గారు మేల్కొని విషయం తెలుసుకొని తన లాలాజలంను పూసి బాధ విముక్తుణ్ణి చేశారు. అలా ప్రవక్త (స) వారి గుహ సహవాసిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు.
విశ్వాసులకు – అవిశ్వాసులకు జరిగిన మొదటి యుద్ధం (బదర్‌) లో విజయానంతరం బందీలుగా చిక్కినవారి విషయంలో వీరు మన సోదరులే, పరిహారం తీసుకొని వదిలి వెయ్యాల్సిందిగా మహోన్నతమైన సలహా ఇచ్చి అబూ బకర్‌ (ర) తన హుందాతనాన్ని చాటుకొని ప్రవక్త (స) హృద యాన్ని దోచుకున్నారు. హిజ్రీ శకం 9 వ సంవత్సరం రోమన్లతో జరిగే యుద్ధం కోసం విరాళాల కోసం ప్రవక్త (స) గారు ప్రకటన గావించగా అబూ బకర్‌ (ర)గారు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకొని మరీ తెచ్చిచ్చారు. ఇంటివారల కోసం అల్లాహ్‌ాను, దైవప్రవక్తను వదిలివెట్టాను అని చెవ్పి ప్రగాఢమైన విశ్వాసాన్ని చాటుకొన్నారు.
ప్రవక్త (స) గారు నమాజు చేయించలేనంతగా వ్యాధిగ్రస్త్తులై పోవడంవల్ల తన స్థానంలో అబూ బకర్‌ (ర) గారిని ఇమాముగా నియమించారు. స్వయంగా ప్రవక్త (స) గారు కూడా కలిసి నమాజు చేశారు. ప్రవక్త (స) చనిపోయిన తర్వాత అబూ బకర్‌ (ర) గారిని ఖలీఫాగా ఎన్నుకోవడం జరిగింది. మేధావులు ఎంతగానో నచ్చజెవ్పిన తర్వాత ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. తను చేస్తున్న వ్యాపారాన్ని మానేసి పూర్తి సమయాన్ని ఖిలాఫ¦త్‌ బాధ్యతలను ఏకాగ్రతతో నిర్వహించడానికి వెచ్చించారు.
హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు ఖలీఫా అయిన తర్వాత కొన్ని తెగలు తిరుగుబాటు చేశాయి. వాటిని ఆయన సమర్థవంతంగా అణచివేశారు. అంత కష్ట కాలంలో కూడా ఆయన సైన్యానికి నీతిబోధనలు చేశారు.
వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
1. నిజాయితీగా వ్యవహరించండి. 2. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. 3. యుద్ధంలో హతులయినవారి అవయవాలు కోసెయ్యకండి, స్త్రీలను, విల్లలను, వృద్ధులను చంపకండి. 4. ఖర్జూరపు చెట్లను నరకడంగాని, కాల్చడంగాని చెయ్యకండి. 5. దొంగతనానికి పాల్పడకండి. 6. మేకలు, గొర్రెలు, ఆవులు, ఒంటెలను తినడానికి తప్ప చంపకండి. 7. చర్చీలలో ఉండి ఆరాధనల్లో నిమగ్నులై ఉండే వారి జోలికి పోకండి. 8. మీకెవరైనా భోజనం వెడ్తె మీరు అల్లాహ్‌ వేరు ఉచ్చరించి తినండి.
హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఖిలాఫ¦త్‌ కాలంలోనే (రాతి వ¦లకలు, చర్మపు ముక్కలు, ఖరూరపు మట్టలు, ఎముకలవై వ్రాయబడిన) ఖుర్‌ఆన్‌ భాగాలను ఒక చోట జమచేసి సమగ్ర గ్రంథంగా రూపొందించటం జరిగింది. హిజ్రీ శకం 13 వ సంవత్సరం, జమాదిల్‌ ఆఖిర్‌ నెలలో హజ్రత్‌ అబూ బకర్‌ (ర) జబ్బు పడ్డారు. ఆయన కోరిక ప్రకారమే ప్రవక్త (స) గారి మరణం లాంటి మరణాన్నే అల్లాహ్‌ ప్రసాదించాడు. ప్రవక్త (స) గారు పరమపదించే నాటికి 63 సంవత్సరాలు, హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారికి కూడా 63 సంవత్సరాలు. ప్రవక్త (స) గారు సోమవారం చనిపోయారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) గారు కూడా సోమవారం (మగ్రిబ్‌, ఇషా మధ్యలో) చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌.
అబూ బకర్‌ (రజి) గారి భార్యలు:
హజ్రత్‌ అబూ బకర్‌ ((ర) నలుగురు స్త్రీలను వివాహమాడారు.
(1) ఖతీలా బిన్త్‌ అబ్దుజ్జా: ఈమె లూయా తెగకు చెందిన మహిళ. ఇస్లాం స్వీకరణకు పూర్వమే ఈమెను వివాహమాడారు.
(2) ఉమ్మె రూమాన్‌ బిన్త్‌ ఆమిర్‌: ఈమె బనీ కనానా వంశానికి చెందిన మహిళ. ఈమెను కూడా ఇస్లాం స్వీకరణకు పూర్వమే వివాహమాడారు.
(3) అస్మా బిన్త్‌ ఉమైస్‌ (ర): ఈమె ఖషామ్‌ వంశానికి చెందిన మహిళ. ముస్లిం అయిన తర్వాత ఈమెను వివాహమాడారు. మొదట ఈమె వివాహం హజ్రత్‌ జాఫ¦ర్‌ బిన్‌ అబీ తాలిబ్‌తో అయింది. హజ్రత్‌ జాఫ¦ర్‌ (ర) అమరగతులయిన తర్వాత ఆమెను హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) వివాహమాడారు.
(4) హబీబా బిన్త్‌ ఖారిజా (ర): ఈమె ఖజ్రజ్‌ తెగకు చెందిన మహిళ. ఈమెను కూడా ముస్లిం అయిన తర్వాతే వివాహమాడారు. సంతానం:
మొదటి భార్య ద్వారా హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ (ర), హజ్రత్‌ అస్మా (రజి) పుట్టారు.
(1) అబ్దుల్లాహ్‌ (ర): ఈయన ప్రారంభంలోనే ఇస్లాం స్వీకరించారు. తాయిఫ్‌ యుద్ధంలో దైవప్రవక్త (లి)తోపాటు పాల్గ్గొన్నారు. హజ్రత్‌ అబూ బకర్‌ (రజి) పాలనా కాలంలోనే ఈయన చనిపోయారు.
(2) హజ్రత్‌ అస్మా (ర): ఈమె సౌర్‌ గుహలో దైవప్రవక్త (స) కు సేవ చేశారు. ప్రవక్త (స) గారు ఆమెను ‘జాతున్‌ నితాఖతైన్‌్‌’ అని ముద్దుగా విలిచారు. హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌ (ర)తో వివాహం జరిగింది. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ జుబైర్‌ (ర) ఈమె కుమారులే. ఆమె వంద సంవత్సరాలు జీవించారు.
రెండవ భార్య ద్వారా హజ్రత్‌ అబ్దుర్రహ్‌ామాన్‌ (ర), విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (ర) గారు జన్మించారు.
(1) అబ్దుర్రహ్‌మాన్‌ (ర): ఈయన చాలా కాలం తర్వాత ఇస్లాం స్వీకరించారు. నాన్నగారి పరిపాలనా కాలంలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రీ శకం 53లో చనిపోయారు.
(2) ఆయిషా (ర): ఈమె వివాహం దైవప్రవక్త (స)తో జరిగింది. ఈమె ఎంతో తెలివితేటలు గల మహిళ. హదీసు విద్యలో గొప్ప పండితురాలు. దాదాపు 70 సంవత్సరాల వయసులో హిజ్రీ శకం 58లో పరమపదించారు. మూడవ భార్య ద్వారా హజ్రత్‌ ముహమ్మద్‌ బిన్‌ అబూ బకర్‌ (శి) పుట్టారు. హజ్రత్‌ అలీ (ర) పాలనా కాలంలో ఈజిప్ట్‌ గవర్నరుగా పని చేశారు. ఈజిప్ట్‌లోనే చనిపోయారు.నాల్గవ భార్య ద్వారా ఉమ్మె కుల్సూమ్‌ (రహ్మలై) జన్మించారు. ఈమె హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారు చనిపోయిన తర్వాత జన్మించారు.
రూపు రేఖలు, గుణగణాలు:
హజ్రత్‌ అబూ బకర్‌ (ర) తెల్లగా, బక్క పలచగా ఉండేవారు. బుగ్గలు సొట్టబోయి ఉండేవి. కళ్ళు కొంచెం లోపలికి ఉండేవి. బట్ట తల. గడ్డానికి గోరింటాకు పూసుకొనేవారు. కొంచెం వంగి నడిచేవారు. చేతి వ్రేలికి వెండి వుంగరం ఉండేది.హజ్రత్‌ అబూ బకర్‌ (ర) ఉదార స్వభావి, అధికంగా దానధర్మాలు చేసేవారు, వేదల వెన్నిధి, మృదు హృదయులు, దివ్య ఖుర్‌ఆన్‌ను పఠిస్తూ దు:ఖించేవారు. ఆయన ఎంతో ధైర్యశాలి, పరాక్రమవంతుడు. ఎక్కువగా అల్లాహ్‌ాకు భయపడేవారు, భక్తిపరులు. రాత్రిళ్ళలో ఆరాధనలలో గడివేవారు, పగటి వేళల్లో ఉపవాసాలు పాటిస్తుండేవారు. సంఘసేవ కోసం ముందుండే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త (స)ను చాలా వరకు అనుకరించేవారు. దైవభీతి పారాయణత, ధనవ్యయంలో జాగ్రత్తలు, అధర్మ సంపాదనకు దూరం, నోటి దురుసు పట్ల జాగ్రత్త, సహచరుల పట్ల సద్వర్తనం, నిగర్వి, నిరాడంబరత ఆయనగారి గుణగణాలకు దర్పణం. ప్రజాసేవ, అతిథి సత్కారంలో అందెవేసిన చెయ్యి. కలల గూడార్థం చెవ్పేవారు. ఏ పుణ్యకార్యమూ వదిలే వారు కాదు.
ప్రపంచ మానవాళికి హజ్రత్‌ అబూ బకర్‌ (ర) చేసిన హితోక్తులు:
(1) దేవుని వ్రియ భక్తులయినవారు సిరిసంపదలన్నింటినీ దేవుని మార్గంలో ధారపోయాలి.
(2) ఇతరులవై నిందారోపణ చేయకండి, మీకు మనశ్శాంతి లభిస్తుంది.
(3) చెడ్డ పనులు చేసేవారికి తోడ్పడేవారు కూడా చెడ్డ పనులు చేస్తున్నట్లే.
(4) సత్కార్యాలు మనిషిని దుష్కార్యాల నుండి కాపాడుతాయి.
(5) మీ వల్ల ఏదైనా పాపకార్యాలు జరిగి ఉంటే వాటికి బదులుగా పుణ్యకార్యాలు చేసి మిమ్మల్ని మీరు దైవశిక్ష నుండి కాపాడుకోండి.
(6) చెడ్డ స్నేహితులతో కలిసి ఉండడం కన్నా మీరు ఒంటరిగా ఉండడమే మంచిది.
(7) పాపం చీకటి లాంటిది. దాన్ని దైవభీతి మాత్రమే తొలగిస్తుంది.
(8) పరలోకం కూడా చీకటి లాంటిది. దాన్ని సదాచరణ అనే వెలుగు పోగొడ్తుంది.
(9) మనసు లగ్నం చేసి చేసే నమాజే అసలైన నమాజు.
(10) జ్ఞానం అనేది దైవప్రవక్తల నుండి వారసత్వంలో లభించే సంపద.
(11) ఆపదను సహనం ద్వారా దూరం చేయవచ్చు.
(12) ఉదయం వెందలాడ లేవడంలో మీరు వక్షుల వెనుక ఉండి పోవడం ఎంతో సిగ్గుచేటయిన విషయం.
(13) మీరు గౌరవించబడాలంటే ఇతరులకు అతిథి మర్యాదలు చేయండి.
(14) పదవీ హోదాల ప్రలోభానికి గురి కాకుండా ఉంటే వేరు ప్రతిష్టలు మీ పాదాలను తాకుతాయి.
(15) మూడు విషయాలు మనిషికి ప్రాణ సంకటంగా మారుతాయి అవి: అన్యాయం, వాగ్దాన భంగం, మోసం

కారుణ్యమూర్తి ముహమ్మద్ (స)

మానవ నైతిక నిధిలో అత్యంత విలక్షణమైన అరుదైన సుగుణం శత్రువులను కనికరించటం, మన్నింపుల వైఖరిని అవలంబించటం విశ్వకారుణ్య మహామనిషి ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహివసల్లం) అని చెప్పక తప్పదు.
అల్లాహ్ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఈ విధంగా సెలవిచ్చాడు ”ప్రవక్తా మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడై పోవడాన్ని గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహన శీలురకు తప్ప మరెవరికీ లభ్యం కాదు.”
విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ మక్కా విజయం ప్రాప్తించిన రోజున, ఆనాడు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ క్షమించివేశారు. శత్రువులు ఆయనను హింసించి, హతమార్చాలని కుట్రలు పన్నారు. ప్రవక్త పిన తండ్రిని హతమార్చి, పచ్చి కాలేయాన్ని నమిలినటువంటి కర్కశులు సైతం ప్రవక్త సమక్షంలో నిస్సహాయులై ఉండగా ఆయన (స) ఎంతో ఔదార్యంతో – ”ఈ రోజు మీపై ఎలాంటి నిందాలేదు. ఇకనుండి మీరంతా స్వతంత్రుల”ని ప్రకటించిన గొప్ప క్షమాశీలి ముహమ్మద్‌ ప్రవక్త (సల్లం).
ఒకరోజు తాయెఫ్‌ ఆనే పట్టణానికి సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లో అందజేయడానికి వెళ్లారు. అక్కడ ప్రజలు అసలు దేవుడంటేనే నమ్మేవారు కాదు. వారు మహా మూర్ఖులుగా సైకోలుగా ప్రవర్తన ఉండేది. దైవానికి కృతజ్ఞతతో దైవ భక్తితో జీవించే బదులు, దైవాగ్రహం కలిగించేలా ప్రవర్తిస్తుండేవారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు వారి వ్యవహారం ఉండేది. అలాంటి గర్వికుల జనం దగ్గరికి వెళ్లి దైవ సందేశం చెబుతుంటే ఆ ఊరి జనం దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లం)పై రాళ్ల వర్షం కురిపించారు.
జనం రాళ్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో దైవాదేశం మేరకు విచ్చేసిన దైవదూత, ఓ ప్రవక్తా ఒక్క అనుజ్ఞ ఇవ్వండి. చాలు ఈ పట్టణాన్ని చుట్టు పక్కల పర్వతాల ద్వారా పిండి, పిండి చేస్తాను అని అన్నప్పుడు దానికి బదులుగా ‘శరీరం గాయపడి, తల నుండి పాదాల వరకు రక్తం కారుతున్న దయనీయ స్థితిలో ఉండికూడా విశ్వకారుణ్య మూర్తి (సల్లం) ఆ దైవదూతతో ‘వీరు సన్మార్గగాములుగా మారక పోయినప్పటికీ వీరి సంతానమైన ఆదైవాన్ని’ తెలుసుకుంటారేమో అని పలికేవారు.
ఇక ఇంటి విషయాల్లో కుటుంబ యజమానిగా ఉత్తమ పురుషుడుగా వర్థిల్లినా మహామనిషి, ఇంటి పనుల్లో, సతీమణులకు చేదోడు, వాదోడుగా ఉండటంతో పాటు, వారి హక్కుల్ని ఎల్లవేళలా నెరవేర్చేవారు. మీ భార్య దృష్టిలో ఉత్తముడే. మీలో ఉత్తముడు అన్న స్వీయ ప్రవచనంలో పోతపోసినట్లు ఒదిగిపోయిన వ్యక్తిత్వం ముహ మ్మద్‌కే సొంతం అని చెప్పవచ్చు.
తల్లిదండ్రులు తమ సంతానానికి ఇచ్చే శ్రేష్టమైన కానుక చదువు సంస్కారాలేనని ప్రబోధించారు. తమ సంతానాన్ని ఎంతో ధర్మశీలురుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. దైవ ప్రవక్త ముహమ్మద్‌ విషయంలో ఎంతో మంది చరిత్రకారులు రాసారు.
ఉదాహణగా ప్రొఫెసర్‌ కె.యస్‌. రామకృష్ణారావు, ముహమ్మద్‌ ప్రవక్త రాజ్యాధినేతగా ఉన్నప్పటికీ ఆయన అతి సాధారణ పౌరుని స్థాయి నుండి అరేబియా పాలకునిగా ఖుస్రా, సీజర్‌లకు సమానుడిగా ఈ పధ్నాలుగు శతాబ్దాల కాలం గట్టిగా నిలిచిన మహా సామ్రాజ్య స్థాపకుడు, ఆ మహారాజు పదిలక్షల చదరపు మైళ్ల వైశాల్యం గల భూమికి ప్రభువు అయినప్పటికీ తన చెప్పులను తానే బాగుచేసుకున్నారని, తన దుస్తులను తానే కుట్టుకున్నారని తెలిపారు. అలాగే రెవరెండ్‌. బాస్వర్డ్‌ స్మిత్‌ కూడా పొగిడి ఉన్నారు. ముహ్మమ్మద్‌ ప్రవక్త 
రాజ్యాధపతిగా నేతగా ఆయన తన
లోనే ఓ సీజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపేగాని పోపులాంటి పటాటోపం లేదు. సీజరే కాని సీజర్‌ లాంటి వైభవం లేదు. ఆ స్థాయి సైన్యమూ లేదు. అంగరక్షకుడు లేడు. ఖజానా లేదు. ప్రపంచంలో ఎవరైనా నిజమైన దైవిక అధికారంతో పరిపాలించారని చెబితే అది ముహమ్మద్‌ ప్రవక్త (స) మాత్రమే. ఆయనకు అన్ని అధికారాలూ ఉండేవి. అయినా ఆ డాంబికాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆయన (స) వ్యక్తిగత జీవితంలో నిరాడంబరత, ప్రజాజీవితంలో సాధారణతలను చరిత్ర చూసిందని తెలిపారు.


    అల్లాహ్ తన అంతిమ గ్రంథం అయిన ఖుర్‌ ఆన్‌లో ఈ విధంగా సెలవిచ్చాడు. ప్రజలారా ముహమ్మద్‌ మీ పురుషులలో ఎవ్వరికీ తండ్రికారు, కాని ఆయన దేవుని సందేశహరులు, ప్రవక్తలందరికీ అంతిమ మయినవారు. అల్లాహ్ ప్రతి విషయ జ్ఞానం ఉన్న వాడు. ఈ వాక్యంలో దైవ తిరస్కారులు, కపటుల అభ్యంతరాలకు సమాధానం ఇచ్చాడు.
    అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ ఇలా తెలిపారు. బనీ ఇస్రాయిల్‌ ప్రవక్తలు నాయకత్వమూ వహించేవారు. ఒక ప్రవక్త మరణిస్తే, మరో ప్రవక్త అతని స్థానంలోకి వచ్చేవాడు. కానీ నా తర్వాత మరో ప్రవక్త రాడు, కేవలం ప్రతినిధులే ఉంటారు.
    మరో హదీసులో ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు. నాకు పూర్వం గతించిన ప్రవక్తలకు గల ఉపమానం ఎటువంటిదంటే, ఒక వ్యక్తి ఒక కట్టడాన్ని నిర్మించాడు. దాన్ని బాగా అందంగా కనుల పండుగగా రూపొందించాడు. కాని ఒక మూలన ఒక ఇటుక మందం స్థలం వదలిపెట్టాడు. జనం ఆ కట్టడాన్ని చుట్టూ తిరిగి చూస్తారు, దాని చక్కదనానికి అబ్బుర పడతారు.కానీ అక్కడ ఇటుక ఎందుకు పెట్టలేదూ అని అడిగేవారు. అయితే ఆ ఇటుకను నేనే. నేను ‘ఖాతమన్నబీయ్యీన్‌’ ని (అంటే నా రాకతో దైవ దౌత్యపు కట్టడం పరిపూర్ణమయింది. మరెవరయినా వచ్చి నింపడానికి ఇక చోటు ఏమీ మిగుల లేదు..).
    ఓ అల్లాహ్‌ ఈ ప్రపంచంలో దజ్జాల్‌ కీడు నుంచి మమ్ములను రక్షించు! నీ ప్రవక్తల్లో చిట్ట చివరి ప్రవక్త ముహ్మమ్మద్‌ ఉమ్మతగా జీవించే ఇహపర భాగ్యం కలిగించు ఆదర్శమూర్తి విశ్వకారుణ్యమూర్తి ఆశయాలకు అనుగుణంగా నీభక్తునిగా మంచి సద్భుద్దులు ప్రసాదించు. ఆమీన్‌!

    సమయం – సందర్భం


    ప్రతి భాషలోనూ మాట్లాడే తీరు, ప్రసంగించేె విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భాషలో మాట్లాడదలచిన వారు వాటిని తెలుసుకోవడం అత్యవసరం. అది ప్రాతీయ చలోక్తులు, సామెతలు, శతకాలు, సుభాషితాలు, పద్యాలు, గద్యాలు, కావ్యాలు ఏవైనా కావచ్చు. వీటి మాధ్యమంతో శ్రోతల హృదయాలను హత్తుకునేలా మాటను చెప్ప గలుగుతాము. అలాగే శ్రోతలను బట్టి భాష, విషయం ఉండాలి. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్నట్టు సామాన్యులతో తాత్విక భాషణలు, చర్చలు లేవనెత్తడం, బరువయిన పదాలను, సమాసాలను వాడటం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు. పైగా ఈ వైఖరి వల్ల మనం అందించాలనుకున్న సందేశం వైఫల్యం చెందుతుంది. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి ఆయన సతీమణి విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”ఆయన (స) మాట ఎంతో విపులంగా, సరళంగా స్పష్టంగా ఉంటుంది. విన్న ప్రతివాడు ఇట్టే అర్థం చెసుకునేవాడు”. (అబూ దావూద్‌)
    ఇకపోతే, మనిషి మానసికంగా మాటను విని జీర్ణించుకోగల స్థితిలో ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని అతనికి బోధించాలి. అలా కాక మనసు పరధ్యానానికి లోనై ఉన్నప్పుడు బలవంతంగా ఏదయినా వినిపిస్తే మొండిగా ఆ బోధను తిరస్కరించే ప్రమాదముంది. వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించే అవకాశమూ లేకపోలేదు. హజ్రత్‌ అలీ (ర) ఇలా ఉపదేశించారు: ”మనసులకు (హృదయాలకు) కొన్ని తత్వాలుంటాయి. కొన్ని ప్రీతికర విషయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆంత ర్యాలు మాటను స్వీకరించటానికి అనుకూలంగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో వాటిలో వెన్ను చూపే స్వభావం ప్రబలి ఉంటుంది. కనుక ప్రజల ఆంతర్యాల తత్వాన్ని బట్టి, అవి హితవును అంగీకరిం చేందుకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిలో ప్రవేశించండి. ఎందు కంటే, మనసును బలాత్కరించినప్పుడు అది గుడ్డిదయిపోతుంది”. (కితాబుల్‌ ఖిరాజ్‌ – అబూ యూసుఫ్‌)
    మరో సదర్భంలో హజ్రత్‌ అలీ (ర) ఇలా అభిప్రాపడ్డారు: ”ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష  పట్ల భయపడనట్లు చెయ్యడో – అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు”. (కితాబుల్‌ ఖిరాజ్‌)
    అంటే – ప్రజలు తమ మోక్షం పట్ల, అల్లాహ్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందేలా నకారాత్మక బోధనలు చేయడం (బాధ గురువులుగా వ్యవ హరించడం) ఎంత తప్పో, ఆల్లాహ్‌ా క్షమా గుణాన్ని, కృపాకటాక్షాల్ని, ప్రవక్త (స) వారి సిఫారసును తప్పుగా చిత్రీకరించి ప్రజలు దైవాజ్ఞ ఉల్లంఘనకు పాల్పడేలా చేయడం, వారిని మొరటు వ్యక్తులుగా తయారు చేసే ఊక దంపుడు ఉపన్యాసాలివ్వడం కూడా అంతే ఘోర మైన నేరం. సరయిన పంథా ఏమంటే, ఉభయ కోణాలూ ముందుం డాలి. అటు నిరాశా జనించకూడదు. ఇటు నిర్భయము, దుస్సాహ సమూ కలగకూడదు.
    దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజల్ని తీర్చిదిద్దే నిమిత్తం సరైన సమయం సందర్బం కోసం ఎదురు చూస్తుండేవారు. అలా ప్రాప్త మయిన మంచి అవకశాన్ని ఆయన సద్వినియోగ పరచుకునేవారు.
    ఓ సారి దైవ ప్రవక్త (స) వారి సమక్షంలోకి కొంత మంది ఖైదీలు తేెబడ్డారు. ఆ ఖైదీలలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె స్తనాల్లో పాలు నిండుగా ఉన్నాయి. ఆ ఖైదీలలో ఒక పసి బాలుడు ఏడ్వడం చూసి ఆమెలోని మమత ఉప్పొంగింది. వెళ్ళి అ పసికందుని అమాంతంగా తన గుండెలకు హత్తుకుని పాలు పట్ట సాగింది. ఈ అద్భుత ధృశ్యాన్ని మహా ప్రవక్త (స) మరియు ఆయన సహచరులు తిలకిస్తున్నారు. (తన సహచరుల్ని ఆ తల్లి ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేెసిందన్న విషయాన్ని గ్రహించిన ప్రవక్త (స) సత్యోపదేశం కోసం ఇది సువర్ణ సమయ మని భావించి) ”ఈ మాతృమూర్తి గురించి మీ అభిప్రాయమేమిటి? ఈమే తన సొంత కుమారుణ్ణి స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చెయ్య గలదా?” అని వారిని ప్రశ్నించారు. ‘అల్లాహ్‌ా సాక్షి! ఈ తల్లి తన చేజే తులా తన పిల్లవాణ్ణి నిప్పుల్లో పడవేయజాలదు’ అని సహాబా ముక్త కంఠంతో బదులిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు: ”ఈ మాతృమూర్తికి తన పిల్లవానిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే (మరో ఉల్లేఖనం ప్రకారం 70 తల్లులకంటే) ఎక్కువ ప్రేమ అల్లాహ్‌ాకు తన దాసులపై ఉంటుంది”. (బుఖారీ ముస్లిం)
    ఓ సారి దైవ ప్రవక్త (స) బజారు గుండా వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కల జనం ఉన్నారు. దారి ప్రక్కన చచ్చి పడి ఉన్న పొట్టి చెవులు గల ఓ మేక పిల్లను చూశారు. (క్రింద కూర్చోని) దాని చెవి పట్టుకొని: ”మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా కొనడానికి ఇష్టపడతారా?” అని ప్రశ్నించారాయన.
    అందుకు – ‘దిర్హముకన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము. ఒకేళ తీసుకున్నా దాన్ని మేమేం చేసుకుంటాము?’ అని బదులిచ్చారు ప్రజలు. అది విన్న దైవ ప్రవక్త: ”ఒకవేళ ఉచితంగా లభిస్తే తీసుకోవడానికి ఇష్టపడతారా?” అని మళ్ళీ అడిగారు. దానికి వారు – ‘అల్లాహ్‌ా సాక్షి! ఒకవేళ అది బ్రతికున్నా (మేము దాన్ని తీసు కోవడానికి ఇష్టపడేవారము కాము) దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన తర్వాత ఎలా తీసుకుం టాం?’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ”వల్లాహి! ఈ మేక పిల్ల మీ దృష్టిలో ఎంత హేయమైనదో అల్లాహ్‌ా దృష్టిలో ఈ లోకం అంతకన్నా హేయమైనది” అని హితవు పలికారు. (ముస్లిం)
    చచ్చి కంపు కొట్టే పశువు దగ్గర నిలబడటం ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వస్తే ముక్కు పుటాలు మూసుకుని మరీ తొందరగా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు ప్రజలు. ఆ చచ్చిన మేక పిల్ల పట్ల అక్కడున్న ప్రజల్లో గల ఏహ్య భావాన్ని గమనించిన ప్రవక్త (స) ఏం చేశారంటే – ముందు ఆ మేక పిల్ల వద్దకు వెళ్ళారు. తర్వాత దాని చెవులు పట్టు కున్నారు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ సందర్భాన్ని హితవు గరిపేందుకు మంచి అవకాశంగా భావించి, వారికి ఐహిక వాస్తవికతను తెలియ పర్చడమే కాక, వారిలోని ప్రాపంచిక వ్యామో హాన్ని అంతమొందించి, పరలోకం కోసం పాటుపడేలా వారిని ప్రేరే పించారు. సుబ్హానల్లాహ్‌!
    ఓ సారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – ”యా రసూలల్లాహ్‌ా! ప్రళయం ఎప్పుడొస్తుందంటారు?” అని ప్రశ్నించాడు.
    చూడబోతే ఈ ప్రశ్న చాలా సామాన్యమైన ప్రశ్నగానే గోచరిస్తుంది. ఆ వ్యక్తి అడిగిన తీరు కూడా సాధారణమైనదే. ప్రవక్త (స) అతనికి బదులిచ్చి సాగనంపాల్సింది. కొన్ని ప్రళయ సూచనలు తెలియజేసి అతని నోరు మూయించాల్సింది. లేదా ఆ దినం గూర్చిగానీ, ఆ ఘడియ గూర్చి గాని నాకు తెలియదు అని, అల్లాహ్‌ాకు మాత్రమే తెలుసునని దాట వేయాల్సింది. కాని ఆయన (స) అలా చేయలేదు. ఆయన అతని అంతర్మధనాన్ని అంచనా వేశారు. పరలోక భీతితో అతని మనో స్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కారణంగానే తను ఈ ప్రశ్న అడిగాడు. ఇది శిక్షణకు సరైన సమయం అని భావించి ప్రవక్త (స) – జవాబివ్వడానికి బదులు అతనికే ఎదురు ప్రశ్న వేశారు: ”ఆ ఘడియ కోసం నువ్వు ఏ విధమైనటువంటి సామగ్రిని కూడబెట్టు కున్నావు?” అని.
    ఈ చిన్న ప్రశ్నతో దైవ ప్రవక్త (స) అతని ఆలోచనా స్రవంతిని సకా రాత్మక దిశన పయనించేలా చేశారు. ప్రళయం ఎప్పుడు వస్తుందన్నది కాదు సమస్య. ప్రళయం కోసం మనం ఏం సమకూర్చుకున్నామన్నది అసలు సమస్య. ఒకవేళ ప్రళయం ఆలస్యంగా వచ్చినా మన వద్ద ఏ విధమైనటువంటి ముందస్తు సామగ్రి లేకపోతే ప్రయోజనం పూజ్యం. అదే మనం అన్ని విధాల సమాయత్తమయి ఉంటే ప్రళయం ఈ క్షణం వచ్చినా భయం లేదు అని స్వయంగా ఆ వ్యక్తి గ్రహించేలా, ఆత్మావ లోకనం చేసుకునేలా చేశారు. అది విన్న ఆ వ్యక్తి తన యావత్తు జీవితాన్ని సునిశితంగా పరిశీలించి ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ పట్ల మరియు ఆయన ప్రవక్త (స) పట్ల ప్రేమ”.
    అంటే, నేను కూడబెట్టుకున్న పరలోక సామగ్రల్లా దైవ ప్రేమ, మరియు దైవ ప్రవక్త (స) వారి ప్రేమ అంతే. జీవిత అన్ని రంగాల్లో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రసన్నుల్ని చేయడమే నా ల క్ష్యం. నా జీవిత ధ్యేయం దైవ దాస్యం. నా జీవితం అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే అంకితం అన్నాడు. అతని నోట ఈ మాట విన్న విశ్వ నాయకులు (స) సంతోషంతో పరవశించిపోతూ అతనికి శుభవార్తను అందజేశారు:
    ”నువ్వు ప్రేమించే, అభిమానించే వారి సరసనే రేపు ప్రళయ దినాన నువ్వుంటావు” అన్నారు. సుబ్బానాల్లహ్‌! (బుఖారీ, ముస్లిం)

    సృష్టిలో దైవ నిదర్శనాలు – 1


    దైవం గురించి సాధారణంగా రకరకాల నమ్మకాలు ప్రజల్లో ఉన్నట్లు మనం గమనిస్తాం. కొందరు దేవుడు ఉన్నాడనీ, కొందరు లేడని అంటారు. దేవుడు ఉన్నాడనీ నమ్మేవారిలో కూడా కొందరు దేవుడు మానవరూపంలో అవతరిస్తాడని, మరికొందరు దేవునికి సంతానం ఉందనీ ఆయనకు సహాయపడేవారు ఉన్నారని తలుస్తున్నారు. దేవుడు లేడని వాదించే నాస్తికులు ఈ సృష్టి వెనుక ఏ శక్తి ప్రమేయమూ లేదనీ, ప్రతీదీ దానంతటగా అదే జరిగిపోతూందని భావిస్తున్నారు.
    యదార్థం ఏమిటంటే ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, రాత్రిపగులు మొదలగు అండ పిండ బ్రహ్మాండాల్ని చూస్తే వాటిని సృష్టించిన ఒక కర్త ఉన్నా డనీ, ఆయనే సర్వశక్తిమంతుడనీ, ఆయనకే సర్వాధికారాలు ఉన్నాయని మనం నమ్మక తప్పదు.
    తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చిందెవరు? జానెడు గర్భాన్ని జగమంతా చేసిందెవరు? అతల, వితల, సుతల, రసాతల, తలాతల,పాతాల లోకా లను, సకల చరాచర సృష్టిని సృష్టించిం దెవరు?ఇవన్నీ వాటంతట అవే అయిపో యాయా?
    ఖలీఫ హారూన్‌ రషీద్‌ దేవుడున్నాడనీ ఆధారమేమిటని ఇమామ్‌ మాలిక్‌(ర)తో ప్రశ్నించగా ఆయన ”వేర్వేరు భాషలు, స్వరాలు, రకరకాలైన శబ్దాలు ఇవన్నీ అల్లాహ్‌ అస్తిత్వాన్ని నిరూపించటం లేదా? అని సమాధానమిచ్చారు.
    ఇమామ్‌ షాఫయి (ర) గారు ఇలా అన్నారు: మల్బరి ఆకుని చూడండి! ఆకు రుచి రంగు మాత్రం ఒక్కటే. దాన్ని పట్టు పురుగు తింటే పట్టు వస్తుంది. తేనెటిగ తింటే తేనె తయారవుతుంది. మేక తింటే పాలు వస్తుంది. అదే ఆకుని జింక తింటే ముష్క్‌ (కస్తూరి) తయారవుతుంది. ఒకే ఆకులో ఇన్ని రకాల నైపుణ్యం ఎవరిది?.
    ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌(ర) ఇలా అన్నారు: ”ఒక బలమైన కోట ఉంది. దానికి వాకిలి, రంధ్రం ఏమీ లేదు, బయట నుంచి బంగారంలా మెరుస్తన్నది. లోపల్నుంచి వెండి పూత పూయబడి ఉంది. గాలి వచ్చీపోయే అవకాశమూ లేదు. అకస్మాత్తుగా గోడ పగులుతుంది, అందులో నుంచి ఈ బుల్లి ప్రాణి బయటికి వస్తుంది. దానికి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కడుపు, వీపు, రెక్కలు మరియు కాళ్ళు కూడా ఉంటాయి. అదే కోడి పిల్ల. ఇదంతా ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న మహత్తరమైన శక్తి ఏమిటి?
    ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(ఓ అసర్వలోక పరిపాలకా!) నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తావు, పగటిని రాత్రిలోనికి తీసుకెళతావు, నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్నవాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికితీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు.(ఆలి ఇమ్రాన్‌:27)
    ”త్వరలోనే మేము వారికి మా సూచనల ను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి (ఉనికి)లోనూ చూపిస్తాము, తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్ల మవుతుంది. ఏమిటి నీ ప్రభువు ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడనీ విషయం చాలదా? (హామీమ్‌ సజ్దా:53)

    ఉప్పు చేదు గల సముద్రం లో మధురమైన నీళ్ళు

    సముద్రాలను పరిశీలిస్తే ఎన్నో నదులు, కాలువలు ప్రవహించి సముద్రంలో కలు స్తాయి, ఈ ప్రపంచంలో కొన్ని చోట్ల రెండు సముద్రాలు కలగలసి ఉన్నప్పటికీ ఒక సముద్రంలో నీరు తియ్యగా ఉంటే మరో సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటాయి. ఒక పళ్ళెంలో ఉప్పుగా ఉన్న నీటిని, తియ్యగా ఉన్న నీటిని వేసి కలిపి నట్లయితే ఉప్పుగా ఉన్న నీరు మరియు తియ్యగా ఉన్న నీరు విడిగా ఉండజాలవు. కానీ తియ్యని సముద్రం యొక్క తియ్య దనపు ప్రభావం ఏమాత్రం ఉప్పుగా ఉన్న సముద్రంపై పడకపోవడం దేన్ని సూచిస్తు న్నది? ఈ అద్భుత వ్యవస్థ సంస్థాపకుడు ఎవరు?
    ఖుర్‌ఆన్‌ యొక్క ఈ వాక్యాన్ని పరిశీలిం చండి: ”రెండు సముద్రాలను – పరస్పరం కలిపి ఉంచినవాడు ఆయనే (అల్లాహ్‌యే). వాటిలో ఒకటి తియ్యనిది, రుచికరమైనది. మరొకటి ఉప్పుగా చేదుగా ఉంది. ఆ రెండింటి మధ్య ఒక తెర (అడ్డుగోడగా) ఉంది. అది వాటిని వేరుగా ఉంచుతుంది. (అల్‌ ఫుర్ఖాన్‌:53)

    వర్షపు నీళ్ళు

    మనం త్రాగే నీళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మేఘాలు ఎలా తయా రవుతాయి? అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు
    ”పోనీ మీరు త్రాగే మంచి నీరు గురించి ఎన్నడయినా ఆలోచిమచారా? దాన్ని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదు నీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఎందుకు మసలుకోరు?
    (అల్‌వాఖియహ్‌:68-70)

    సూర్యచంద్రులు

    ముహమ్మద్‌ ఇస్‌హాఖ్‌ సిద్దీఖీ తన పుస్తకం ‘ఖుద్రత్‌ కె భేద్‌”లో ఇలా వివరించారు: ”చంద్రుడు భూమికి అతి సమీపములో ఉన్న గ్రహము. అది భూమి నుంచి రెండు లక్షల నలభై వేల మైళ్ళ దూరంలో ఉంది. మరియు సూర్యుడు భూమి నుంచి తొమ్మిది కోట్ల ముఫ్పై లక్షల మైళ్ళ ఎత్తులో ఉన్నాడు. అక్కడి వరకు రాకెట్‌లో ప్రయా ణిస్తే ఏడు సంవత్సరాలు పడు తుంది. దాని వైశాల్యం 13 లక్షల భూములకు సమానం”. అలాంటి సూర్యచంద్రుల్ని నియంత్రణలో పెట్టింది ఎవరు? ఖుర్‌ఆన్‌ లో ఇలా ఉంది: ”సూర్య చంద్రులను నియంత్రణలో ఉంచినది అల్లాహ్‌ాయే, ప్రతి ఒక్కటీ నిర్ధారిత సమయంలో తిరుగుతోంది. (అర్రాద్‌:2) ఇంకా ఇలా సెలవిచ్చాడు: ”ఏమిటీ, అల్లాహ్‌ భూమండలంలో ఉన్న సమస్తాన్నీ ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఒడలను మీకు వశపరచటాన్ని మీరు చూడటం లేదా? తన అనుజ్ఞ కానంత వరకూ భూమిపై విరుచుకుపడ కుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మనుషుల పై దయార్థ్రత కలవాడు. జాలి చూపే వాడు. (అల్‌ అహ్‌జాబ్‌:65)

    విత్తనం

    నేలలో విత్తనం నాటినప్పుడు అందులో ఏమీ లేదు. కొన్ని రోజుల తరువాత మొక్కగా రూపొందుతుంది. ఆ తరువాత ఆకులుగల పెద్ద వృక్షంగా రూపొందు తుంది. దానికి తియ్యనిపండ్లు కాస్తాయి. అయితే ఆ తియ్యదనం నేలలోనూ లేదు, నాటబడిన విత్తనంలోనూ లేదు. మరి ఆ తియ్యదనం ఎక్కడ నుంచి వచ్చింది? అల్లాహ్‌ా ఇలా సెలవిచ్చాడు : ”సరే! మీరు నాటే వస్తువును (విత్తనాన్ని) గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
    ఏమిటి, దాన్ని మీరు పండిస్తున్నారా? లేక దానిని పండించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని పొట్టుపొట్టుగా చేసేయగలము, మరి మీరు ఆశ్చర్యంతో లబో దిబో మంటూ అసలుకే నష్టపో యామే! అంతేకాదు మేము దీనికీ నోచు కోకుండా పోయాము అని వాపోతారు. (అల్‌వాఖియహ్‌:63-67)
    యదార్థం ఏమిటంటే మనిషి పొలం దున్నగలడు. విత్తనం నాటగలడు, ఎరువు వేసి నీరు సరఫరా చేయగలడు, కాని పంట పండించే శక్తి అల్లాహ్‌ాకు మాత్రమే ఉంది. మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత శక్తివంతుడైనా, ఎంత ప్రతిభావంతుడైనా ఒకే ఒక ఈగను సయితం సృష్టించలేడు సృష్టించడం ఏమిటి, ఈగ అతన్నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే అతను దాన్నుండి ఆ వస్తువును విడిపించుకో లేడు కూడా. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:


      ”ఓ ప్రజలారా! ఒక ఉపమానం చెప్ప బడుతోంది; శ్రద్ధగా వినండి. అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే మొరపెట్టు కుంటున్నారో వారంతా ఏకమైనా-ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకు పోతే వారు దాన్ని కూడా దాని నుంచి విడిపించుకోలేరు.అర్థించేవాడూ, అర్థించ బడేవాడూ – ఇరువురూ బలహీనులే. (అల్‌హజ్‌;73)


      Wednesday, 28 May 2014

      వ్యక్తి మరియు సమాజంపై పాప ప్రభావం


      బుద్ధి చేసే బోధనలకు బానిసయి మనిషి, అల్లాహ్‌ మార్గానికి దూరమైపోతాడు. మనసు కోరిన కోరికల మేరకు తన జీవన పథాన్ని నిర్మించుకుంటాడు. సత్యం, సదాచారాం, సత్కార్యాలు అతని చూపుకు ఆనవు. వీటికి బదులు స్వార్థం, స్వలాభం, స్వప్రయోజనాలు ప్రాధాన్యత వహిస్తాయి. అతను తన మనో కాంక్షలనే తనకు అవసరయోగ్యమయినవిగా భావిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే, తన కాంక్షలనే దైవంగా చేసుకుంటాడు. మనిషి ఈ మనో స్థితిని ఇలా అద్దం పట్టి చూపిస్తు ంది ఖుర్‌ఆన్‌: ”నీవు ఎప్పుడయినా ఆ వ్యక్తి పరిస్థితిని గమనించావా-తన మనోకాంక్షల నే తన దైవంగా చేసుకున్నవాడిని?”. (ఫుర్‌ఖాన్‌: 43)
      దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశిం చారు: ”స్వర్గం మనసుకి రుచించని విషయాలతో కప్పబడి ఉంది. నరకం మనోభిరామ కాంక్షలతో కప్పబడి ఉంది”. (ముత్తఫఖున్‌ అలైహి)
      సజ్జన పాఠకుల్లారా! సృష్టిలోని సమస్తమూ శోభతో, సువ్యవస్థతో, సామరస్యంతో వ్యవహ రిస్తోందంటే, అంతా ఒకే సృష్టికర్త, ఒకే ప్రభువు, ఒకే నిర్వహణకర్త అయిన అల్లాహ్‌ ప్రచండ అధికారానికి తల ఒగ్గినందుకే. సర్వం ఆయన దాస్యంలో స్వయం సమర్పణ చేసుకోవడం మూలానే ప్రకృతి వ్యవస్థలో ఈ సమన్వయం, సామరస్యం, ఏకత్వంలో భిన్న త్వం, భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమయింది.  ప్రపంచ వ్యవస్థలోనూ నెమ్మది, శాంతి, తృప్తి నెలకొనాలంటే, మనం సయితం ఆ ఒక్క నిజ ఆరాధ్యునికే తల వంచాలి. ఆయన విధేయు లమయి జీవించాలి. అదే ప్రకృతిలో సామ రస్యం పొందగల మార్గం. అదే ప్రకృతి అను సరించే విధానం. అదే విశ్వమంతటా విస్తరిం చిన వాస్తవం. ఒక్క మాటలో చెప్పాలంటే, విధేయత, సత్కర్మ మనిషిని ఇహపరాల్లో సాఫల్య బాటన విజయవంతంగా నడిపిస్తే, అవిధేయత, పాపం, దుష్కర్మ మనిషిని ఇహ పరాల్లో పరాభావానికి, అధోగతికి గురి చేసి అపకీర్తి పాలు చేస్తుంది.
      ‘పాపం, అవిధేయత అనేది పుణ్యం, విధేయ తకు విరుద్ధమయినది. షరీయతు పరిభాషలో -పాపం, అవిధేయత అంటే, అల్లాహ్‌ ఆదేశించిన, ఆయన ప్రవక్తలు ప్రబోధించిన, ఆయన గ్రంథాలు ఉపదేశించిన అంశాలను విడ నాడటం, వ్యతిరేకించడం’ అన్నారు అల్లామా ఇబ్ను తైమియా (ర).   ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అవిదేయత అనేక అర్థాల్లో వాడబడింది. పాపం, తప్పు, చెడు, అనైతికత, అశ్లీత, అసభ్యత, అవినీతి, అక్రమం, అన్యాయం, దౌర్జన్యం, దుర్మార్గం, అపమార్గం, అసత్యం, అలజడి, అల్లకల్లోలం,నీచత్వం, లోభం,వ్యామోహం, మదం, మత్సర్యం, విధ్వం సం, అత్యాచారం, హద్దు మీరడం, మూర్ఘత్వం, మంకుతనం, ఉప ద్రవం, హత్య..మొదలయిన అర్థాల్లో చెప్పబడింది.
      సజ్జన పాఠకుల్లారా! నేడు ఎటు చూసినా, అశాంతి, అలజడి, అశ్లీ లం, అనైతికం, అమానవీయం, అక్రమం, అన్యాయం విలయతాం డవం చేస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన కుబేరులు మొదలు కూటికి గతిలేని ఆమ్‌ ఆద్మీ వరకు ఈ సామాజిక రుగ్మతల వాతన పడిన వారే. కారణం, అల్లహ్‌ ఆదేశాల పట్ల అశ్రద్ధ, అలక్ష్యం, అవిధేయ తలే. ఖుర్‌ఆన్‌ ఇలా హెచ్చరిస్తుంది: ”ఎవరయితే అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయినట్లే జాగ్రత్త!”. (అహ్జాబ్‌:36)
      ”ఎవడు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) యెడల అవిధేయుడయి ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని నరకాగ్నిలో పడ వేస్తాడు. వాడందులో కలకాలం పడి ఉంటాడు. అవమానకరమ యిన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది”.
      దీనికి భిన్నంగా – ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స)కు విధే యత చూపేవారికి అల్లాహ్‌, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల లో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే”. (నిసా: 13) కాబట్టి పాపం అది చిన్నదయినా, పెద్దదయినా మనం మాత్రం దానికి దూరంగా మసులుకోవాలి.
      పాపాలు అనేవి కబీరా-పెద్దవి, సగీరా-చిన్నవి అన్న రెండు భాగాలు గా ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసి కూడా మంకుతనం మానక నిశ్శం కోచంగా పాల్పడే ఏ చిన్న పాపం చిన్నదిగా ఉండదు. అలాగే పశ్చా త్తాపం చెంది, తౌబా చేసుకున్న తర్వాత ఏ పెద్ద పాపం పెద్ద పాపంగా మిగులదు అన్నారు పండితులు. అలాగే పాపాలను మూడు శ్రేణుల్లో విభజించారు ఇబ్ను తైమియా (ర).
      1) ప్రజలపై చేసే దౌర్జన్యం: అన్యాయంగా ఒకరి ఆస్తికి హక్కుదారులై కూర్చోవడం. ఒకరికి దక్కాల్సిన హక్కుల్ని కాలరాయడం. ఒకరికి ప్రాప్తమయి ఉన్న అనుగ్రహాలను చూసి ఓర్వలేనితనంతో కుతకుత లాడటం.
      2) ఆత్మపై దౌర్జన్యం: మద్యం, మాదకద్రవ్యాల సేవనం, వ్యభిచారం.. వగైరా.
      3) రెండూ కలగలసిన దౌర్జన్యం: అక్రమార్జనతో మాదకద్రవ్యాల సేవనం. అధర్మ ఆస్తితో మగువ లోలత్వానికి బానిస్వడం వగైరా.
      ఈ పాపాలనే మరో రకంగా కూడా విభజించవచ్చు.
      1) విశ్వాస పరమైన పాపాపలు: షిర్క్‌-బహుదైవారాధన, కాపట్యం, ప్రదర్శనాబుద్ది వగైరా…
      2) నైతిక పరమైన పాపాలు: మద్యపానం, వ్యభిచారం, వగైరా..
      3) ఆరాధనల పరమైన పాపాలు: నమాజుకు వెళ్ళక పోవడం, జకాత్‌ చెల్లించకపోవడం వగైరా…
      4) ప్రవర్తనా పరమైన పాపాలు: వాగ్దాన భంగం, దొంగతనం, దోపిడి, లంచం, వడ్డీ వగైరా…పోతే పాప ప్రభావ విషయానికొస్తే అది రెండు విధాలు – వ్యక్తిపరమైనది, సామాజికపరమైనది.

      వ్యక్తిపరమైనది -హృదయాలకు తుప్పు పడుతుంది:

      దైవప్రవక్త (స) అన్నారు: ”ఏ హృదయంలోనయితే అల్లాహ్‌ా స్మరణ ఉంటుందోఅది సుబిక్ష హృదయం.మరే మనస్సులోనయితే అల్లాహ్‌ స్మరణ ఉండదో అది దుర్బిక్షమయిన హృదయం-పాడుబడిన బంగళా వంటిది” అని. మరో సందర్భంలో ఆయన హృదయం వైపు సైగ చేస్తూ ”దైవభీతి ఇక్కడుంటుంది” అని అన్నారు.
      ఏ హృదయం అయితే అల్లాహ్‌ ఘనతా ఔన్నత్యాలకు ఆలయ మయి ఉంటుందో, మరే హృదయంలోనైతే అల్లాహ్‌ పట్ల భక్తిప్రప త్తులు ఉప్పొంగుతాయో, అల్లాహ్‌ భీతితో కంపించిపోతుందో ఆ హృదయానికి అల్లాహ్‌ అన్నా, అల్లాహ్‌ ఆదేశాలన్నా, ఆయన ప్రవక్త లన్నా, వారి ప్రబోధనాలన్నా, ఆయన గ్రంథాలన్నా, వాటి ప్రవచ నాలన్నా వల్లమాలిన అభిమానం, గౌరవం ఉంటుంది. ఫలితంగా అలాంటి హృదయం కలిగిన వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా, వారి మనో సీమలు ప్రకాశమానంగా ఉంటాయి.
      మరెవరి గుండెల్లోనయితే అల్లాహ్‌ భయం, భక్తి సన్నగిల్లుతుందో అట్టి గుండెల్లో గుబులు అనే గుబురు పొదలు పేరుకుపోతాయి. అవి అదే స్థాయి ఏమరుపాటుకి గురవుతాయి. దీని గురించి వివ రిస్తూ దైవప్రవక్త (స) ఇలా విశదపర్చారు: ”దాసుడు ఒక మంచి కార్యం చేస్తే అతని హృదయ ఫలకంపై ఒక తెల్లని మచ్చ ఏర్పడు తుంది. ఆ సత్క్రియ క్రమాన్ని అతను అలానే కొనసాగిస్తే మొత్తం హృదయం కాంతిమయమైపోతుంది. అదే అతను పాపం చేస్తే అతని మనోఫలకంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది.ఆ దుష్క్రియ క్రమాన్ని అతను గనక కొనసాగిస్తే అది పెరిగి మొత్తం హృదయం చీకటిమయం అయిపోతుంది. దాన్నే ‘రైన్‌-తుప్పు’ అంటారు. దాని గురించే ఖుర్‌ఆన్‌ ఈ విధంగా పేర్కొంది: ”అసలు విషయమేమి టంటే, వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది”.  (ముతఫ్ఫిఫీన్‌: 14)
      మరో చోట ఇలా సెలవియ్యబడింది: ”(వారి) చర్మచక్షువులకు అంధత్వం లేదు. వారి హృదయాలకు ఉన్న ఆత్మచక్షువులకే అంధ త్వం ఆవహించింది”. (హజ్జ్‌:46)
      ఫలితంగా వారు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రయాలు ఉండి కూడా సత్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోతారు. ఇక ఎవరి హృదయ కవా టాలు మూసుకుపోతాయో అతని అవయవాలన్నీ ఎన్ని సత్యాలు చూసినా, విన్నా స్పదించవు. ఆ ఆత్మచక్షువుల అంధత్వం వారి వద నాలపై, వారి ఆలోచనపై, వారి ప్రతిపాదనలపై, వారి నడకలపై, నడవడికలపై కొట్టుకొచ్చినట్లు కనబడుతుంది.  హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అభివిర్ణించారు: ”సత్కర్మ ఫలితంగా మనిషి వదనం కాంతులీనుతోంది. హృదయం జ్యోతీర్మయం అవుతోంది. ఉపాధిలో సమృద్ధి శుభాలు ఒనగూడుతాయి. శరీరంలో శక్తి చోటు చేసుకుంటుంది. సృష్టిచరాచరాల గుండెల్లో ఆ వ్యక్తి కోసం ప్రేమాభి మానాలు పెల్లుబుకుతాయి. ఇది సత్కర్మ ప్రభావమయితే, దుష్కర్మకు పాల్పడే వ్యక్తి వదనం దుమ్ముకొట్టుకొని కళాహీనమయి ఉంటుంది. హృదయంలో చీకట్లు రాజ్యమేలుతాయి. శరీరంలో సత్తువ నశి స్తుంది. ఉపాధిలో శుభం లేకుండా పోతుంది. సృష్టిరాసుల మనస్సు లో ఆ వ్యక్తి పట్ల ద్వేషభావన, ఏహ్యభావన నిండి పోతుంది.
      ఓ సందర్భం ఒక వ్యక్తి ‘మంచీచెడులను ఎలా అంచనా కట్టాలి?’ అని మహనీయ ముహమ్మద్‌ (స) వారిని అడిగాడు. దానికి బదులి స్తూ ఆయన-”ఓ పని చేస్తూ నీకు అంతరంగికంగా ఆత్మానందం కలిగిందంటే అది మంచి అని తెలుసుకో. ఒక పని చేస్తూ నీ ఆంత ర్యంలో శంక కలిగి, ప్రజలు ఎక్కడ చూస్తారేమో అన్న భయం ఏర్ప డితే మాత్రం అది చెడు అని గుర్తుంచుకో!” అని అన్నారు ప్రవక్త (స).
      మనం చేస్తున్నది మంచా, చెడా? మనం మంచి వ్యక్తులమా, చెడ్డ వ్యక్తులమా? అన్నది మన అంతరాత్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి ఒకరి దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మన కు సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ, మన దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మాత్రం పూర్తిగా మనకు సంబంధిం చిన విషయం. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నిశ్చయంగా ఆత్మ ప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మ ఘోషను అణచి పెట్టినవాడు నాశనమవుతాడు”. (షమ్స్‌:8,9)
      ఇక ఎవరయితే తమ అంతరాత్మ గొంతును నిర్ధాక్షిణ్యంగా నులిమి వేశారో, ఎవరి మనో సీమలయితే దానవత్వానికి దగ్గరగా దాన గుణానికి దూరంగా తయారయ్యాయో వారు చెడును మంచిగా, మంచిని చెడుగా, నాగరికతను అనాగరికతగా, ఆటవికాన్ని ఆధు నికంగా చూస్తారు. ఫలితంగా అంతిమ శ్వాస ఆగే అంతిమ ఘడి యల్లో ‘కలిమా-లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’కు సయితం నోచుకోకుండా చెడ్డ చావు చస్తారు
       వ్యక్తి మరియు సమాజంపై పాప ప్రభావం

      నమాజు చేద్ధాం! ఛలో, ఛలో!!


      ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్‌ బిన్‌ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”.
      ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా?  లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
      అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు?  అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది?
      ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్‌ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్‌ ఫలాహ్‌ా- సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్‌ రూపంలో స్వయంగా అల్లాహ్‌ా మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ా అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒన
      గూడుతుంది?అతనికి  రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్‌ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్‌ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్‌ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం!  దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి.
      ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ా ఆదేశం.అల్లాహ్‌ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్‌ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా?
      కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్‌ వాక్కును ధృవ పరుస్తాడు.  నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.   (ఆలి ఇమ్రాన్‌: 39)
      ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు   పట్ల   మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా?
      నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్‌ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.”  (అల్‌ పతహ్‌: 29)
      అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35)
      ”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47)
      మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2)
      అల్లాహ్‌ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు?
      తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్‌; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా?
      మనం  ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్‌ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా?
      ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్‌ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్‌: 16)
      చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో!
      ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర  హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా  పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే.
      ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు?
      ”అల్లాహ్‌ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్‌ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్‌ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్‌ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి!
      అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు  వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల  దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష  చేసుకోవాలి.