Shanti priya
ప్రతి శిశువు పుడుతుంది ప్రకృతి
ధర్మంపై నీవు ప్రకృతిగా, నేను ప్రకృతిగా
ఏకేశ్వరోపాసకులైతే అదే తౌహీద్
సహవర్తులనీ, శక్తులనీ, భాగస్తులనీ
ప్రతి వస్తువును మ్రొక్కితే అదే షిర్క్
వర్ణ భేదం వర్గ వైషమ్యం కులతత్వం
అస్పృశ్యం అంటరానితనం వద్దు వద్దని
చంచలత్వం, లోభత్వం మోహ భుక్తం
వలదు వలదని అరచినా గీపెట్టినా వినదు
ఈ లోకం, రాళ్ళు రువ్వును పైశాచికం
విశ్వ జనుల్లారా! గ్రంథ ప్రజల్ల్లారా!! రండి
మనందరి మధ్య సమైక్యమైన సిద్ధాంతం వైపునకు
'అల్ల్లా నఅబుద ఇల్లల్లాహ్‌ా వలా నుష్రిక బిహి
షైఅ, వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్‌బాబమ్
మిన్ దూనిల్లాహ్‌ా!!!'1 అంటూ మిథ్యా భక్తుల మీద
మండి పలికిన ప్రవక్త ప్రవచనం నిజం, మారని ఇజం.
నేలకందిన ఆ పిలుపు నింగిపై నుంచి
విన్పించెను. మతం చాటునున్న బూజు దులిపెను
జనులు గీసిన వృత్తాలు దాటీ, ఒక్క పలుకే
ఉక్కు పిలుపై అవని మొత్తం మారుమ్రోగెను
ప్రజలపై పడివున్న ఆంక్షల బరువులు దించెను
పాలితులలో, శ్రామికులలో సత్య చేతన బీజం నాటిన
సత్య, సస్య విప్లవ దీప్తులందరిలో ముహమ్మద్ (స) చిట్టచివరి ప్రవక్త.
సభ్యతకు, సంస్కారానికి ఆదిలోనే
అండగా నిల్చి ఊతమిచ్చి నడిపినవారే ప్రవక్తలు
ఆటవికమైన అమానుషమైన అలనాటి ఆ
దర్వ్యవస్థ దుమ్ము దులిపి ధర్మ ఢంకా
మ్రోగించిన మహోజ్వల క్రాంతికారులు ప్రవక్తలు
ఆ జనని ఆ అరబ్బు అవని
అన్య దురాచారాక్రమితయై
నిజం దాగీ, సత్యం సమసీ
అసత్యం ప్రబలి, అధర్మం వెర్రి తలలు వేసే
దృశ్యం చూసి ఎంత కాలమని దాస్యం
సాగించవలెను సత్యాన్వేషణని ఒక
అమీన్ సాదిఖ్ పిలుపునిచ్చెను విశ్వ ధాత్రిని
తట్టి లేపెను.
ఆ మాట ఆణిముత్యంగా
ఆ ప్రబోధనం అక్షర సత్యంగా
ఆ ప్రవచనం నవ నినాదంగా
అదేె ధర్మం అదే మోక్షంగా
పల్లెపల్లెను పట్టణాలను మఠాలను
మతాధిపతులనూ సంకుచిత సంకెళ్ళు త్రెంచి
స్వతంత్ర భానులుగా సాత్వికులుగా కదలి
రమ్మని పిలుపునిచ్చెను
ప్రబోధించిన ప్రవక్త ఒక్కరే; అధర్మం
నశించి, మృగత్వం మెడలు వంచి మానవత్వం
జయించింది. అస్తమించిన స్వేచ్ఛా వాయువులు
సత్య సుగంధాలు వెదజల్లనారంభించాయి
గిరులు, ఝరులు నింగి నేలా శాంతి తంత్రి నినదించాయి
విశ్వంలో కాంతిని, విశ్వ జనుల్లో శాంతిని నింపాయి
అదిగో విశ్వ కారుణ్యమూర్తి అంటూ శ్రేయ శంఖం పూరించాయి
1- ''మనం అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. ఆయనకు సాటి కల్పించకూడదు. మనలో ఎవరూ అల్లాహ్‌ాను తప్ప ఇతరుల్ని ప్రభువుగా స్వీకరించకూడదు''. (ఆలి ఇమ్రాన్: 64)

No comments:
Post a Comment