సాలెహ్ అల్ ఫౌజాన్
దైవ ప్రవక్త (స)
క్రైస్తవుల్లో జొరబడిన షిర్క్ గురించి చెబుతూ ఇలా అన్నారు: ''వారు తమలోని పుణ్యపురుషులు చనిపోయిన తరువాత వారి సమాధులపై మస్జిద్ కట్టి వివిధ
భంగిమల్లో వారి ఫోటోలు తగిలించేవారు. అలాంటివారు అల్లాహ్‌ా దృష్టిలో ప్రజల్లోకెల్లా
అత్యంత నీచమైన వాళ్ళు''. (ముత్తఫఖున్ అలై)
సమాధుల వైపు తిరిగి నమాజు చేయడం కూడా దీనిలోకే
వస్తుంది. ప్రవక్త (స) దీని గురించి ఇలా చెప్పారు: ''సమాధులపై 'ముజావర్'గా కూర్చోకండి. మరి వాటి వైపు తిరిగి నమాజు చేయకండి''
. (ముస్లిం)
సమాధుల వైపు నిలబడి నమాజు చేయడం నిషిద్ధమైతే సమాధులపై
నమాజు చేయడం ఇంకా తీవ్రమైన నిషిద్ధం.
దైవ ప్రవక్త
(స) వారి ఈ హదీసులు సమాధులను 'మస్జిద్'గా చేయడాన్ని ఖండిస్తున్నాయి.
ఎందుకంటే దైవప్రవక్త (స) తన మరణానికి 5 రోజుల ముందు వీటి గురించి చాలా గట్టిగా తాకీదు చేశారు.
దైవప్రవక్త
(స) మనల్ని ఈ చర్యల నుండి రక్షించాలని పలు విధాల ఉదాహరణలతో చెప్పారు. 1) యూదులు, క్రైస్తవులను శపించటం. 2) వారి వినాశనం కోసం దుఆ. 3) దేవుని సృష్టిలో వారిని పరమ నీచులుగా ఖరారు చేయడం.
4) జాగ్రత్త! సమాధులను ప్రార్థనాలయాలుగా
చేసుకోకండి అని చెప్పడం.
ముస్లింలలో అధికుల
ధోరణి:
బాధాకరమైన విషయం
ఏమిటంటే ముస్ల్లింలలో అధికులు దైవప్రవక్త (స) నిషేధించిన విష వలయంలోనే ఇరుక్కున్నారు.
దైవప్రవక్త (స) నిషేధించిన పని చేసి షిర్క్
అక్బర్‌లో పడిపోయారు. సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మించి వారి పేరున బలిదానాలు,
దుఆలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. తల నీలాలు సమర్పిస్తున్నారు.
మరి వీరు దైవ దృష్టిలో ఎలాంటివారిగా పరిగణించబడతారో?
ఇమామ్
ఇబ్నె ఖయ్యిమ్ (స) ఇలా చెప్పారు: ఎవరైనా ఒకవైపు
దైవప్రవక్త (స) సంప్రదాయం మరియు సహాబాల విధానంన రెండో వైపు ప్రస్తుతం ముస్లింలు చేసే
నిర్వాకాన్ని చూస్తే వారు ప్రవక్త (స) వారి సంప్రదాయానికి విరుద్ధంగా నడుచు కుంటున్నారన్న
నిజం గ్రహిస్తారు. ఎందుకంటే -
అ) దైవప్రవక్త (స)
సమాధుల వైపు తిరిగి నమాజు చేయకూడదని తాకీదు చేశారు. కాని వారు సమాధుల వైపు తిరిగి నమాజు చేస్తున్నారు.
ఆ) దైవప్రవక్త (స)
సమాధులపై మస్జిద్ నిర్మాణం నిషేధించారు. కాని వారు సమాధులపై మస్జిద్‌లు, దర్గాలు నిర్మిస్తున్నారు.
ఇ) దైవప్రవక్త (స)
సమాధులపై దీపాలు వెలిగించకూడదన్నారు. కాని వారు దీపాలు వెలిగిస్తున్నారు.
ఈ) దైవప్రవక్త (స)
సమాధుల దగ్గర జాతర, ఉరుస్ చేయకూడదన్నారు.
కాని వారు సమాధుల దగ్గర జాతర, ఉరుసులు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఉ) దైవప్రవక్త (స)
సమాధులను ఎత్తుగా చేయకూడదని, వాటిపై ఇల్లు వగయిరా కట్టకూడదన్నారు. కాని వారు మాత్రం సమాధులను ఎత్తుగా కట్టి
గుంబద్‌లు నిర్మిస్తున్నారు. సమాధుల సందర్శనలోని అసలు ఉద్దేశ్యం:
హజ్రత్ బురైదా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స)
ఓసారి ప్రజలతో ఇఆల అన్నారు: ఇంతకు ముందు నేను
మిమ్మల్ని సమాధులను సందర్శించవద్దని
వారించే వాణ్ణి. కాని ఇప్పుడు చెబుతున్నాను. మీరు సమాధులను సందర్శించండి. (ముస్లిం)
తిర్మిజీలో ఈ వాక్యం అదనంగా ఉంది: ''సమాధుల సందర్శనం పరలోకాన్ని జప్తికి తెస్తుంది.
మరో చోట ఇలా ఉంది: ''ఈ సందర్శన ప్రాపంచిక
వ్యామోహాన్ని తగ్గిస్తుంది''.
ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో దైవప్రవక్త (స) తన అనుచరులను సమాధుల్ని సందర్శించవద్దని చెప్పారు.
అనుచరులు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారవటం చేత సమాధుల్ని సందర్శించినప్పుడు అజ్ఞానకాలపు
భావోద్రేకాలకు లోనై షరీయతుకు విరుద్ధమయిన పనులు చేస్తారేమోనని ఆయన ఆందోళన చెందేవారు.
అయితే తర్వాతి కాలంలో వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకుని నికార్సయిన ముస్లింలుగా
పరిణతి చెందిన తర్వాత ఆయనకు ఆ భయం పోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని సందర్శించేందుకు అనుమతినిచ్చారు. పైగా తరచూ 'సందర్శిస్తూ ఉండాల'ని తాకీదు చేశారు. తాము ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న
భావన ప్రజల మనో మస్తిష్కాలలో మెదులుతూ ఉండాలన్నదే
ఆయన ప్రవచనంలోని అసలుద్దేశ్యం. అంతేగాని సమాధుల వద్ద ఉరుసుల పేరుతో తమాషా చేయడానికి,
మొక్కుకోవడానికి కాదు. ఈ రకమయిన
చేష్టలకు షరీఅత్‌లో ఏ మాత్రం చోటు లేదు.

No comments:
Post a Comment